Krishna Kowshik
80,90వ దశకంలో హీరో హీరోయిన్లుగా నటించిన నటీనటులు ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు. కొత్తగా కనిపిస్తూ అభిమానుల్లో ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేస్తున్నారు. ఆ కోవకే వస్తారు స్కంద మూవీలో రామ్ పోతినేని తండ్రి పాత్రలో నటించాడు దర్శకుడు భారతీ రాజా హీరో.
80,90వ దశకంలో హీరో హీరోయిన్లుగా నటించిన నటీనటులు ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు. కొత్తగా కనిపిస్తూ అభిమానుల్లో ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేస్తున్నారు. ఆ కోవకే వస్తారు స్కంద మూవీలో రామ్ పోతినేని తండ్రి పాత్రలో నటించాడు దర్శకుడు భారతీ రాజా హీరో.
Krishna Kowshik
ఒకప్పుడు హీరో, హీరోయిన్లుగా, కమెడియన్లుగా, విలన్లుగా, కీలక పాత్రల్లో నటించిన నటులంతా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేస్తున్నారు. వీళ్లు ఏమయ్యారో అనుకుంటున్న సమయాల్లో తెరపై కనిపిస్తూ అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ముందు తరం నటీనటులు అంతా కీలక పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తున్నారు. నిజం చెప్పాలంటే.. మరింత జోష్‌తో తమలోని నటనకు ప్రాణం పోస్తున్నారు. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా వేరో పనుల్లో బిజీగా ఉన్నా..మళ్లీ వెండితెరపై రాణిస్తున్నారు. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా.. లోపల ఒరిజినల్ అలాగే ఉంది అన్న చందంగా యాక్ట్ చేస్తున్నారు ఒకప్పటి స్టార్ నటీనటులు.
ఆ కోవకే వస్తారు దగ్గు బాటి రాజా. ప్రముఖ నిర్మాత దివంగత రామానాయుడి సోదరుడి కొడుకు. అతడి అసలు పేరు వెంకటేష్. అయితే సినిమాల్లోకి వచ్చాక రాజాగా మార్చుకున్నారు. 80, 90 దశకంలో తెలుగు, తమిళ, మలయాళ మూవీస్‌లో హీరోగా చేశారు. భారతీ రాజా దర్శకత్వంలో నాలుగు సినిమాలు చేశారు. సుమారు 90 చిత్రాల్లో నటించిన ఆయన సడెన్‌గా కెరీర్‌కు కామా పెట్టి వెళ్లిపోయారు. స్కందతో మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చారు. అందులో రామ్ పోతినేనికి తండ్రిగా కనిపించి.. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే అంత ముందు కూడా పలు సినిమాల్లోకి కనిపించినప్పటికీ.. బోయపాటి మూవీతోనే వార్తల్లో నిలిచారు. చిత్రాలకు బ్రేక్ ఇచ్చినా.. ఆయన మరో రంగంలో బిజీగా మారారు.
1981లో పాక్కు వెతలై అనే తమిళ సినిమాతో తెరంగ్రేటం చేశారు. తెలుగులో సిరిపురం చిన్నోడు, వైదేహి, ఝాన్సీరాణి, సంకెళ్లు, చిన్నారి స్నేహం, ఏడు కొండల స్వామి, గురు బ్రహ్మ, వనిత, నేటి సావిత్రి కనిపించారు. తమిళ డబ్బింగ్ సినిమాలతోనూ మెరిశారు. అజిత్, దేవయాని సూపర్ హిట్ మూవీ ప్రేమ లేఖలో కూడా కీలక పాత్రలో కనిపించారు. సతీ లీలావతి, లవ్ బర్డ్స్ వంటి చిత్రాల్లో కనిపించారు. 2000లో కన్నుక్కు కన్నగ అనే మూవీస్‌కు బ్రేక్ ఇచ్చారు. మళ్లీ 9 సంవత్సరాల తర్వాత సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఎన్టీఆర్-కథానాయకుడు, మహానాయకుడులో నటించారు. ఆదిత్య వర్మ, ఎఫ్‌సియుకె, స్కంద వంటి చిత్రాలతో మెరిశారు. స్కందలో ఆయన లుక్ చూసి ఇప్పటి తరం మాత్రం కాస్తంత ట్రోల్స్ చేశారు. కానీ ఆ తర్వాత అతడి గురించి తెలిసి ఆశ్చర్యపోయారు.
తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఆయన.. పలు ఇంటర్వ్యూలో ఆయన ఎందుకు సినిమాలకు దూరం అయ్యారో చెప్పారు. కేవలం కొత్తగా ఏదో చేయాలనిపించి సినిమాలకు బ్రేక్ ఇచ్చారట. గతంలో మళ్లీ ఆఫర్లు వచ్చినప్పటికీ.. రొటీన్ రోల్స్ రావడంతో.. మంచి క్యారెక్టర్ కోసం ఎదురు చూశారట. ఇండస్ట్రీ నుండి తప్పుకున్న.. ఆయన బిజినెస్ రంగంలో స్థిరపడ్డారు. మార్చుల్, గ్రానైట్, ఫ్లోరింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బిజీగా మారారు. కోట్ల విలువ చేసే సంస్థలకు అధిపతిగా ఉన్నారు. తమిళనాడులోనే స్థిరపడిన రాజా.. ప్రస్తుతం ఫాంలోకి రావడంతో మళ్లీ మూవీస్ చేస్తున్నారు. ఆయనకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు ఆర్టిటెక్ట్‌గా ఉంటే.. కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నట్లు తెలుస్తోంది.