ఇండస్ట్రీలో రోజురోజుకి కొత్త మార్పులు సంతరించుకుంటున్నాయి. టెక్నికల్.. బడ్జెట్స్.. మార్కెట్స్ పరంగానే కాదు.. నటీనటుల విషయంలోను మార్పులు కనిపిస్తున్నాయి. అదేంటి నటుల విషయంలో మార్పులు జరిగితే మంచిదేగా.. కొత్త నటులు, కొత్త పాత్రలు వస్తారని మీకు అనిపించవచ్చు. అయితే.. ఈ మధ్య గెస్ట్ రోల్స్ లో మెరిసేవారు.. కెమెరా వెనుక మెగా ఫోన్ పట్టుకొని ఉండే దర్శకులు కూడా నటులుగా అవతరిస్తున్నారు. ఇదివరకు కొందరు దర్శకులు ఆల్రెడీ తమ తమ సినిమాలలో గెస్ట్ అప్పియరెన్స్ గా కనిపించడం జరిగింది. కానీ.. వేరే దర్శకుల సినిమాలలో కీలకపాత్రలు పోషించడం అనేది చాలా తక్కువ.
ఇండస్ట్రీలో అలాంటి సందర్భాలు కూడా చాలా తక్కువ. బాలీవుడ్ గురించి కాదు.. తెలుగుతో పాటు సౌత్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. సౌత్ లో హీరోహీరోయిన్స్ తర్వాత కీలక పాత్రలలో సీనియర్ యాక్టర్స్ లేదా వేరే భాషల నుండి పిలిపించి మరీ చేయించేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ పోయి.. కొత్త ట్రెండ్ వచ్చేసింది. ఇంపార్టెంట్ రోల్స్ లో ఏకంగా దర్శకులు రంగప్రవేశం చేసేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సినిమాలలో టాప్ డైరెక్టర్స్ అంతా కెమెరా ముందుకు వస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో వరల్డ్ వైడ్ గుర్తింపు పొందిన రాజమౌళి.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ‘కల్కి’ మూవీలో నటిస్తున్నాడు.
అదే కల్కి సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్లు తెలిసిందే. ఆల్రెడీ వర్మ తన పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సైతం నటనలో అడుగు పెట్టేసాడట. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ పెదకాపు. సెప్టెంబర్ 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో.. శ్రీకాంత్ అడ్డాల కీలకపాత్ర పోషించినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఇదేగాక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జవాన్ లోను.. డైరెక్టర్ అట్లీ అలా చిన్నగా మెరిసిపోయాడు. సినిమాలలో కీలకపాత్రల కోసం వేరే నటులు అవసరం లేదని.. మన దర్శకులే ఆ లోటును పూరించేస్తున్నారని ప్రేక్షకులు అంటున్నారు. మరి దర్శకులు సినిమాలలో నటించడం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.