Krishna Kowshik
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను వ్యక్తం చేశారు ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య. ఫేస్ బుక్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. కారణం ఏమిటంటే..?
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను వ్యక్తం చేశారు ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య. ఫేస్ బుక్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. కారణం ఏమిటంటే..?
Krishna Kowshik
2001లో మనసంతా నువ్వే మూవీతో పరిచయమైన దర్శకుడు విఎన్ఆదిత్య. దివంగత నటుడు ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరో హీరోయిన్లు. ఈ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందే అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆదిత్య శ్రీరామ్, నేనున్నాను, మనసు మాట వినదు, బాస్, ఆట, రెయిన్ బో వంటి చిత్రాలు తెరకెక్కించారు. ఇందులో నేనున్నాను సక్సెస్ అయ్యింది. 2011 తర్వాత ఆయన హిట్ ముఖమే చూడలేదు. 2018లో ఓ ఇంగ్లీష్ మూవీ చేశాడు కానీ అసలు తీసిన విషయమే తెలియదు. ఆ తర్వాత ఆయన మూడు సినిమాలు రూపొందించాడు. లవ్ @ 65, మర్యాద కృష్ణయ్య, మీరెవరు వంట చిత్రాలు తీసినప్పటికీ.. ఇవి విడుదలకు నోచుకోలేదు. అయితే ఈ సినిమా విడుదల కావడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ కారణమని దర్శకుడు విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రముఖ మీడియా సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశాడు దర్శకుడు విఎన్ ఆదిత్య. తన మూడు చిత్రాలను విడుదల చేయకుండా నాలుగేళ్లుగా సదరు సంస్థ జాప్యం చేస్తోందంటూ ఫేస్ బుక్ వేదికగా నిరాశను వెలిబుచ్చారు. తమ సంస్థ నుండి రాబోతున్న మిస్టర్ బచ్చన్, స్వాగ్, విశ్వం, మా కాళి వంటి చిత్రాల గురించి చర్చిస్తున్నాం అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ ఫోటోను ఎఫ్బీ వేదికగా పంచుకుంది. ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకున్న విఎన్ఆదిత్య.. ‘నా మూడు విలువైన, సెన్సిబుల్ సినిమాలు ఈ సంస్థ ద్వారా విడుదల అవుతాయని నాలుగేళ్లుగా ఎదరు చూస్తున్నాను’ అంటూ నిర్మాతల పేర్లను ట్యాగ్ చేశారు. అలాగే ‘ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది. నిక్కము నిన్నే నమ్మితి.. చిత్తంబికనూ.. నీ చిత్తంబికనూ’ అంటూ అన్నమయ్య కీర్తనను రాశారు.
అలాగే ‘పీఎమ్ఎఫ్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ)లో ఒక మూవీ రిలీజ్ చేయడానికి అవసరమైన జనాభా అంతా ఒకే ఫ్రేమ్ లో కూర్చున్నారు.. కనీసం రిలీజ్ చేయాల్సిన నా మూడు సినిమాల గురించి ఒక మాటన్నా అనుకోవాలి కదా.. అరక్షణం డిస్కషన్ అది.. నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా.. ఇంక ఓపిక నశించి, పబ్లిక్‌లో అడుగుతున్నా’ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించారు. కాగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీమ్ ఎందుకు ఆ సినిమాలు రిలీజ్ చేయడం లేదో కారణాలు తెలియరాలేదు. అయితే.. వీరి చర్యతో విఎన్ ఆదిత్య మాత్రం బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విషయానికి వస్తే.. కార్తీకేయ 2, వెంకీ మామ, నిశ్శబ్దం, ఓ బేబీ, ధమకా వంటి చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ ప్రొడక్షన్ హౌస్‌గా అవతరించింది. ఇప్పుడు మరో నాలుగు సినిమాలను లైన్లో పెడుతుంది.