Venkateswarlu
నిర్లక్ష్యం తాలూకా ఖరీదు ఓ నిండు ప్రాణం కావచ్చు. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలే పోవచ్చు.. దర్శకుడు వెంకీ కుడుముల కుటుంబంలోనే నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని కోరింది..
నిర్లక్ష్యం తాలూకా ఖరీదు ఓ నిండు ప్రాణం కావచ్చు. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలే పోవచ్చు.. దర్శకుడు వెంకీ కుడుముల కుటుంబంలోనే నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని కోరింది..
Venkateswarlu
సమస్య ఏదైనా కావచ్చు.. కొన్ని సార్లు నిర్లక్ష్యం చేస్తే దాని పరిమాణం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అస్సలు కూడదు. జ్వరం, జలుబు ఇతర ఏ సమస్య అయినా రోజుల కొద్దీ బాధిస్తున్నపుడు డాక్టర్ల సలహా తీసుకోవటం మంచిది. దాని పాటుగా అదే తగ్గుతుంది అనుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. చిన్న అనారోగ్యాలు.. పెద్ద రోగాలకు బయటి సూచనలు కావచ్చు. అందుకే దేన్నీ నిర్లక్ష్యం చేయకూడదు.
తాజాగా, ప్రముఖ తెలుగు దర్శకుడు వెంకీ కుడుముల బంధువు నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. జ్వరం అనుకున్నది కాస్తా ప్రమాదకర వ్యాధిగా తేలింది. ఆరోగ్యం కుదుటపడేలోపే ప్రాణాలు పోయాయి. ఈ విషయాన్ని స్వయంగా వెంకీ కుడుముల తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ అది జ్వరం మాత్రమే కాదు… మా కజిన్‌కు గత కొద్ది వారాల నుంచి ఫీవర్ ఉంది. అయితే, ఆమె దాన్ని నిర్లక్ష్యం చేసింది. డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు. దాన్ని కేవలం జ్వరం మాత్రమే అనుకుంటూ ఉంది. అయితే, అది జీబీ సిండ్రోమ్ అనే రేర్ మెడికల్ కండీషన్‌గా తేలింది.
దానికితోడు మరికొన్ని సమస్యలు కూడా తెలత్తాయి. వాటిని మొదట్లోనే గుర్తించి చికిత్స తీసుకుని ఉంటే ఆరోగ్యం బాగయ్యేది. వాయిదా వేసుకుంటూ వెళ్లటం వల్ల అతడి ప్రాణం పోయింది. కుటుంబానికి తీరిన నష్టం వాటిల్లింది. మీ శరీరం సరైన కండీషన్‌లో లేనప్పుడు.. అది జ్వరం, ఇతర అనారోగ్యాలతో కొన్ని సూచనల్ని ఇస్తుంది. ఆ సూచనల్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లి చూపించుకోండి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవటానికి కొంత సమయాన్ని కేటాయించుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే.. డాక్టర్లను సంప్రదించండి. దయచేసి నిర్లక్ష్యం చేయకండి’’ అని అన్నారు.
కాగా, వెంకీ కుడుముల కాగా, వెంకీ కుడుముల ‘ఛలో’ సినిమాతో తన డైరెక్టర్‌గా మారారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను అందుకున్నారు. ఈ సినిమాకు గాను బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్‌గా సైమా అవార్డును సొంతం చేసుకున్నారు. 2020లో నితిన్ హీరోగా ‘భీష్మ’ అనే సినిమా చేశారు. ఈసినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘‘ వీఎన్‌ఆర్ ట్రియో’’ షూటింగ్ జరుపుకోనుంది. మరి, నిర్లక్ష్యం కారణంగా దర్శకుడు వెంకీ కుడుముల బంధువు ప్రాణాలు పోగొట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.