Kalki 2: కల్కి 2లో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు? నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే?

కల్కి 2లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉన్నాడా? కృష్ణుడు పాత్ర వేస్తున్నాడా? అన్న ప్రశ్నకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ విధంగా స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

కల్కి 2లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉన్నాడా? కృష్ణుడు పాత్ర వేస్తున్నాడా? అన్న ప్రశ్నకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ విధంగా స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

‘కల్కి 2898 ఏడీ’.. గత వారం రోజులుగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మూవీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతూ.. దూసుకెళ్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే దాదాపు రూ. 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. ఔరా అనిపించింది. ఇక ఈ మూవీ సూపర్ సక్సెస్ ను సాధించడంతో.. తాజాగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కు ఆన్సర్ ఇచ్చాడు. కల్కి 2లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉన్నాడా? కృష్ణుడు పాత్ర వేస్తున్నాడా? అన్న ప్రశ్నకు నాగ్ అశ్విన్ ఈ విధంగా స్పందించాడు.

కల్కి 2898 ఏడీ.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన ఓ అద్భుత ప్రపంచం. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించడంతో.. మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సందర్భంగా రిపోర్టర్ ప్రశ్నిస్తూ..”కల్కి 2లో సూపర్ స్టార్ మహేశ్ బాబు కృష్ణుడి పాత్రలో నటిస్తే.. బాగుంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు దీనికి మీ సమాధానం ఏంటి?”

ఈ ప్రశ్నకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆన్సర్ ఇస్తూ..”కల్కి 2లో మహేశ్ బాబును తీసుకోవాలని అనుకోవడం లేదు. కృష్ణుడి పాత్రలో ఆయన నటిస్తే బాగుంటుంది. కానీ ఈ మూవీలో ఆయన లేరు. మరేదైనా చిత్రం మహేశ్ చేస్తే బాగుంటుంది” అని చెప్పుకొచ్చాడు. నాని, నవీన్ పొలిశెట్టిలను ఈ చిత్రంలో ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్నకు..”వాళ్లిద్దరిని ఈ చిత్రంలో తీసుకోవడం కుదరలేదు. ఎక్కడ ఛాన్స్ వస్తే.. వాళ్లను అక్కడ పెట్టేస్తాను” అని నాగ్ అశ్విన్ అన్నాడు. ఈ చిట్ చాట్ లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కు అంతే ఆసక్తికరంగా ఆన్సర్ ఇచ్చాడు నాగ్ అశ్విన్.

Show comments