Venkateswarlu
దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవికి అత్యంత దగ్గరి బంధువు. మెగాస్టార్‌కు తమ్ముడి వరుస అవుతారు. రమేష్ 2002లో...
దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవికి అత్యంత దగ్గరి బంధువు. మెగాస్టార్‌కు తమ్ముడి వరుస అవుతారు. రమేష్ 2002లో...
Venkateswarlu
జయాలు, అపజయాలు ఎవరి భవిష్యత్తునూ నిర్ధేశించలేవు. సినిమా పరిశ్రమకు ఈ సూత్రం కచ్చితంగా వర్తిస్తుంది. అప్పటి వరకు వరుస వైఫల్యాలతో ఉన్న వారి జీవితం ఒక్క హిట్టుతో శిఖరాగ్రానికి చేరొచ్చు.. ఒక్క ప్లాపుతో జీవితం అథఃపాతాళానికి పడిపోవచ్చు. ఏది జరిగినా కొంతమంది సృష్టించిన చరిత్ర మాత్రం ఓ శిలా శాసనంలా చెక్కు చెదరకుండా మిగిలిపోతూ ఉంటుంది. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ తనకంటూ కొన్ని పేజీల్ని సృష్టించుకున్నారు దర్శకుడు మెహర్ రమేష్.
దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవికి అత్యంత దగ్గరి బంధువు. మెగాస్టార్‌కు తమ్ముడి వరుస అవుతారు. రమేష్ 2002లో వచ్చిన ‘బాబీ’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇదే నటుడిగా ఆయన మొదటి, చివరి సినిమా. తర్వాత నటుడిగా ఏ సినిమాలోనూ నటించలేదు. నటనకు దూరం అయి.. దర్శకత్వానికి దగ్గరయ్యారు. కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. 2004లో పూరీ జగన్నాథ్ తెలుగులో తీసిన ఆంధ్రావాలాను కన్నడలో వీర కన్నడిగా తీసి దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈ సినిమాలో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించారు.
ఆ తర్వాత 2006లో ఒక్కడు సినిమాను కన్నడలో రీమేక్ చేశారు. ‘అజయ్’ పేరుతో 2006లో తెరకెక్కిన ఆ సినిమాలో కూడా పునీత్ రాజ్‌కుమార్ హీరోగా చేశారు. ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. కన్నడలో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. 2008లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కంత్రీ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని నమోదు చేయలేకపోయింది.
కంత్రీ వైఫల్యంతో మెహర్ రమేష్ కృంగిపోలేదు. రెట్టించిన ఉత్సాహంతో రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘ బిల్లా’ సినిమా చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా.. అత్యంత స్టైలిష్‌గా కనిపిస్తారు. ప్రభాస్ లుక్.. మ్యానరిజం బాలీవుడ్-హాలీవుడ్ హీరోలతో పోటీ పడే విధంగా క్రియేట్ చేశారు రమేష్. ప్రభాస్ లుక్‌పై టాలీవుడ్‌లోని ఇతర స్టార్లు కూడా ప్రశంసలు కురిపించటం విశేషం. ఇక, ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేయటమే కాదు.. ప్రభాస్ కెరీర్‌లో మైలు రాయి సినిమాగా మారిపోయింది.