మురారి రీ-రిలీజ్‌ థియేటర్లలో పెళ్లిళ్లు! డైరెక్టర్‌ కృష్ణవంశీ సీరియస్‌

Krishna Vamsi, Murari, Murari Re Release, Mahesh Babu: మురారి రీ రిలీజ్‌ అయిన థియేటర్లలో కొంత మంది యువతీయువకులు పెళ్లిళ్లు చేసుకున్నారు. దీనిపై డైరెక్టర్‌ కృష్ణవంశీ రియాక్ట్‌ అవుతూ.. సీరియస్‌ అయ్యారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..

Krishna Vamsi, Murari, Murari Re Release, Mahesh Babu: మురారి రీ రిలీజ్‌ అయిన థియేటర్లలో కొంత మంది యువతీయువకులు పెళ్లిళ్లు చేసుకున్నారు. దీనిపై డైరెక్టర్‌ కృష్ణవంశీ రియాక్ట్‌ అవుతూ.. సీరియస్‌ అయ్యారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచి మురారి సినిమాను రీ రిలీజ్‌ చేశారు. కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు తండోపతండాలుగా రప్పించిన సినిమా అది. అలాంటి ఒక క్లాసిక్‌ మూవీని మరోసారి థియేటర్లలో చూసి ఆస్వాదించేందుకు మహేష్‌ బాబు అభిమానులు థియేటర్లకు పొటెత్తారు. అయితే.. కొన్ని చోట్ల యువతీయువకులు థియేటర్లలోనే దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు.

మురారి సినిమాలో పెళ్లి సన్నివేశాలు, పెళ్లి పాట ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌.. అందుకే ఆ సీన్స్‌కు బాగా కనెక్ట్‌ అయిన కొంత మంది అభిమానులు తమ ప్రేయసిని థియేర్‌లోనే పెళ్లాడారు. ఆ పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేష్‌ బాబు ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదంటూ.. నెటిజన్లు సోషల్‌ మీడియాలో వాటిని తెగ షేర్‌ చేశారు. అలాగే కొంతమంది డైరెక్టర్‌ కృష్ణవంశీకి ట్యాగ్‌ చేస్తూ.. కొత్త జంటలను ఆశీర్వదించాలంటూ కోరారు.

ఈ పెళ్లిళ్లపై స్పందించిన కృష్ణవంశీ సీరియస్‌ అయ్యారు. ‘మన సంస్కృతి, సంప్రదాయాలను ఇలా అపహాస్యం చేయొద్దు. అలాగే అవమానించకండి. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. కొంతమంది తెలిసీ తెలియక అలా చేసి ఉంటారు.. వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను’ అంటూ పోస్ట్‌ పెట్టారు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషీయన్లకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు చెప్పారు. హీరో మహేష్‌ బాబుకు, ఆయన అభిమానులకు కూడా ఈ సందర్భంగా కృజ్ఞతలు తెలియజేశారు. మరి థియేటర్లలో పెళ్లిళ్లపై కృష్ణవంశీ సీరియస్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments