Swetha
Koratala Shiva About Chiranjeevi: జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. తారక్ నటిస్తున్నాడు కాబట్టి ఈ సినిమాపై భారీ హైప్ ఉంది . కొరటాల ఆఖరి సినిమా ఫెయిల్ అయింది కాబట్టి కాస్త భయం కూడా ఉంది. దీనితో నెట్టింట రకరకాల బజ్ వినిపిస్తుంది. కానీ రీసెంట్ గా కొరటాల మాటలతో క్లారిటీ వచ్చేసింది.
Koratala Shiva About Chiranjeevi: జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. తారక్ నటిస్తున్నాడు కాబట్టి ఈ సినిమాపై భారీ హైప్ ఉంది . కొరటాల ఆఖరి సినిమా ఫెయిల్ అయింది కాబట్టి కాస్త భయం కూడా ఉంది. దీనితో నెట్టింట రకరకాల బజ్ వినిపిస్తుంది. కానీ రీసెంట్ గా కొరటాల మాటలతో క్లారిటీ వచ్చేసింది.
Swetha
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో దేవర వస్తుంది. ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. అది మంచి సక్సెస్ నే అందుకుంది. కాబట్టి దేవర విషయంలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. అందులోను ఆరేళ్ళ తర్వాత తారక్ సోలో ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి హిట్ పక్కా. ఇలా ఈ సినిమాపైన భారీ హైప్ ఉంది. అయితే కొరటాల ఆఖరి సినిమా ఆచార్య ఫెయిల్ అయింది. కాబట్టి, ఈ సినిమాపై కాస్త భయం కూడా ఉంది. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో కొరటాల చెప్పిన మాటలతో.. ఈ దర్శకుడు చిరంజీవిని ఇండైరెక్ట్ గా కామెంట్ చేశాడంటూ.. నెట్టింట భిన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కానీ రీసెంట్ గా కొరటాల చెప్పిన మాటలతో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. అదేంటో చూసేద్దాం.
దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల తారక్ , కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో కొరటాలకు.. “మీరు భయం గురించి సినిమా చేశారు కదా.. మరి మీరు దేనికి భయపడతారు?” అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా “మనకి ఇచ్చిన పనికి మనం జవాబుదారీ. ఆ పనిని పూర్తి చేయాలనే భయంతో, మనం దానిని పూర్తి చేస్తే.. ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు. ఎవడి పని వాడు చేస్తే.. ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. మనది మనం చెయ్యక.. పక్కనోడి పనుల్లో చెయ్యి దూర్చి, ఆయన్ని ఇబ్బందిపెట్టి.. ఇలాంటి చేస్తేనే సమస్య.” అని చెప్పారు. దీనితో ఈ వ్యాఖ్యలు ఇండైరెక్ట్ గా చిరంజీవిని టార్గెట్ చేసినట్లు ఉన్నాయ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే మిర్చి, శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను లాంటి సినిమాలతో.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు కొరటాల. అలాంటిది ఆచార్య మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఆచార్య సినిమా తీసే సమయంలో.. కొరటాలను పని చేసుకోనివ్వలేదని, చిరంజీవి కథను మార్చేలా చేశారని సోషల్ మీడియాలో ఓ ప్రచారం ఉంది.
అంతే కాకుండా చిరు కూడా.. ఆచార్య మూవీ ప్లాప్ అవ్వడానికి కారణం కేవలం కొరటాల మాత్రమే అన్నట్లుగా కామెంట్ చేసినట్లు , దాని కారణంగా వారిద్దరి మధ్య దూరం కూడా ఏర్పడినట్లు.. జోరుగా వార్తలు వినిపించాయి. దింతో ఇప్పుడు ఈ విషయంపై కొరటాల రివర్స్ కౌంటర్ ఇచ్చారంటూ బజ్ నడుస్తుంది. కానీ కొరటాల మాత్రం దీనిపై రీసెంట్ గా క్లారిటీ ఇచ్చేసారు. అసలు ఆచార్య ప్లాప్ అయినా వెంటనే మొదటిగా మెగాస్టార్ నుంచే ఆయనకు మెసేజ్ వచ్చిందని.. అనవసరంగా ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని.. అంతే కాకుండా వారి మధ్య మంచి అనుబంధం ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆచార్య ఫెయిల్ అయిందని ఫీల్ కాకుండా మూడో రోజు నుంచే దేవర మోషన్ పోస్టర్ వర్క్ లో బిజీ అయినట్లు చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు. ఏదేమైనా హీరోలు , దర్శకుల మధ్యలో సంబంధాలు బాగానే ఉంటాయి. వారు అలా ఉన్నారు కాబట్టే హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులకు మంచి కథలను అందించగలుగుతున్నారు. ఇక ఆచార్య ఫెయిల్ అయినా కానీ.. కేవలం కొరటాల మీద ఉన్న నమ్మకంతో తారక్ దేవర సినిమా చేశాడు. దీనిని బట్టే కథపై హీరోకు , దర్శకుడికి ఎంత ధైర్యం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ధైర్యాన్ని , వారి నమ్మకాన్ని ఎలా అయినా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలనీ.. ప్రేక్షకులు గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి కొరటాల చిరంజీవి విషయంలో స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.