Dil Raju: దిల్ రాజును ఎందరు ఫాలో కాగలరు?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వరుస సక్సెస్​లతో ఫుల్ స్వింగ్​లో ఉన్నారు. చిన్న చిత్రాల నుంచి బిగ్ మూవీస్ వరకు ఆయన లైనప్ పెద్దగానే ఉంది. ఆయన నుంచి అందరూ ఇన్​స్పైర్ కావాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వరుస సక్సెస్​లతో ఫుల్ స్వింగ్​లో ఉన్నారు. చిన్న చిత్రాల నుంచి బిగ్ మూవీస్ వరకు ఆయన లైనప్ పెద్దగానే ఉంది. ఆయన నుంచి అందరూ ఇన్​స్పైర్ కావాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.

దిల్ రాజు అంటే సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ హ్యాండ్ అనే పేరుంది. హిట్ అయినా ఫ్లాపయినా, సమర్థవంతంగా సినిమాలు తీసే టేస్టు, గట్స్.. వీటితో పాటు వందల కోట్ల వ్యయంతో ‘గేమ్ ఛేంజర్’ లాంటి మూవీస్ తీస్తూ, మరోవైపు ‘బలగం’ లాంటి పిట్ట సినిమాలు తీసి, పెద్ద హిట్స్ చేసే కెపాసిటిని దిల్ రాజు ఒక్కరే ప్రదర్శించగలరు. ప్రదర్శించారు కూడా. ఎందరిని పరిచయం చేశారు.. ఎంతమందికి లైఫ్ ఇచ్చారో లెక్కే లేదు. మిగతా ఆపీసుల్లోలా కాదు. ఒక్క దిల్ రాజు తప్పితే మరే ఇతర ప్రొడక్షన్ ఆపీసుల్లోనూ డైరెక్షన్ కోసం అహోరాత్రాలు కష్టపడి, అర్ధాకలితో అలమటిస్తూ కథలు రాసుకుని వస్తే, వాడికి చెప్పు వీడికి చెప్పు అని పురమాయిస్తున్నారు. ఆ సదరు వీడూ, వాడుకి టైమే ఉండదు పాపం. ఒకవేళ ఉన్నా పూర్తిగా వినకుండానే బాగోలేదని చెప్పి పంపేయడం, లేదా అందులో మంచి పాయింట్ ఉంటే బేషరతుగా కాజేయడం ఇదీ వరస. దాని నామధేయం స్టోరీ డిపార్ట్​మెంట్.

దిల్ రాజు వారిలా కాదు. తానే స్వయంగా విని, సావకాశంగా చర్చించి, ఫైనల్ వెర్షన్ వరకూ ప్రతీ దశలోనూ శ్రద్ధగా, బుద్ధిగా పాల్గొని సినిమా సెట్స్ కి వెళ్ళేవరకూ ఒక వాచ్​మన్​లా పనిచేయడం వల్లే ఆయన సక్సెస్ కి పర్యాయపదంగా మారగలిగారు. దివంగత ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత, ఫైనాన్షియర్ నారాయణదాస్ నారంగ్ ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజును ఈ విషయంలోనే ప్రశంసించారు. కథని వినడమే కాదు, కరెక్ట్​గా జడ్జ్ చేయగలుగుతున్నారు, దానికి కావాల్సిన బడ్జెట్ ను గట్స్ తో కేటాయించగలుగుతున్నారు, అందుకే దిల్ రాజు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వగలుగుతున్నారని మెచ్చుకున్నారు. ఇది పరిశ్రమలో ఎవ్వరూ కాదనలేరు. ఓ పక్కన గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న వందల కోట్ల ‘గేమ్ ఛేంజర్’ ఎక్కడ.. జబర్దస్ట్ వేణు అనే ఓ చిన్న కామెడీ నటుడు చెప్పిన ‘బలగం’ కథ ఎక్కడ? హస్తిమశకాంతరం ఉంది రెండింటి మధ్య.

దిల్ రాజు ముందు ఎన్ని ఛాలెంజింగ్ ప్రాజెక్టులు ఉన్నా మంచి కథపై ఆయనకు ఉన్న మమకారం, అనురక్తి కారణంగానే బుడ్డ కమెడియన్ వేణు కథకి బలం వచ్చి, ‘బలగం’గా మారి ఒక సంచలనం రేపింది. వేణు అనుకున్న బడ్జెట్ ఒకటైతే, దిల్ రాజు చేతిలోకి వచ్చాక బడ్డెట్ కాంప్రమైజ్ కూడా లేకుండా ఖర్చు పెట్టి, ప్రమోషన్లు కూడా తానే స్వయంగా ట్రాక్టర్ వేసుకొని గ్రామగ్రామానికి తిరిగి ‘బలగం’ సినిమాకి ప్రాణప్రతిష్ట చేశారు దిల్ రాజు. అదీ కమిట్​మెంట్ అంటే. నిన్నమొన్నటి వరకూ దిక్కూదివాణం లేకుండా తిరిగిన వేణుకి ఇప్పడు చూపించుకోవడానికి ఓ దిక్కూ, చెప్పుకోవడానికి ఓ దివాణం కూడా ఏర్పడ్డాయంటే అది దిల్ రాజు చలువే. నాని లాంటి ఓ రేంజ్ ఉన్న హీరోతో ఈ రోజున వేణు సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడంటే, అది కేవలం దిల్ రాజు ఇచ్చిన ప్రోత్సాహ బలమే కారణం. లేకపోతే ‘ఎల్లమ్మ’ ఎలా తెరమీదకి ఎక్కుతుంది? దిల్ రాజు మీద అసూయ పడడం, ఆయన మీద బురద జల్లే కార్యక్రమాలతో టైం వేస్ట్ చేసుకోకుండా, ఆయన చేస్తున్న మంచి పనులను ఆదర్శంగా తీసుకుంటే పరిశ్రమకి మంచిది. వేణు వంటి మరో పది మంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తారు.

ఇదీ చదవండి: మహాశివరాత్రి రోజు బిగ్ బాస్ ఫేమ్ కీర్తిభట్ షాకింగ్ కామెంట్స్!

Show comments