జోష్ మూవీ లో సూపర్ హిట్ పాటకి దిల్ రాజు సింగర్, ఇంతకీ ఆ సాంగ్ ఏంటో తెలుసా?

Dill Raju Singing a Song in Josh Movie: దిల్‌ రాజు మొదట సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేశారు. తర్వాత నిర్మాతగా మారారు. ఇప్పటి వరకు 40 సినిమాలు తెరకెక్కించారు. ఆయనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది...

Dill Raju Singing a Song in Josh Movie: దిల్‌ రాజు మొదట సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేశారు. తర్వాత నిర్మాతగా మారారు. ఇప్పటి వరకు 40 సినిమాలు తెరకెక్కించారు. ఆయనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది...

కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. ఇతర వుడ్‌లలోనూ నిర్మాత దిల్‌ రాజుకు మంచి గుర్తింపు ఉంది. తెలుగు నాట అయితే, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు 20 ఏళ్ల క్రితం దిల్‌ రాజు సినీ నిర్మాతగా తన జర్నీ మొదలుపెట్టారు. 2003లో వచ్చిన దిల్‌ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 40 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాణమే కాదు.. డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోనూ ఆయనకు ఆయనే సాటి.

దిల్‌ రాజు ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే సినిమా చేస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్ర షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, అసలు విషయానికి వస్తే.. దిల్‌ రాజుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారు దిల్‌ రాజు సింగింగ్‌ టాలెంట్‌ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. దిల్‌ రాజుకు పాటలపై మంచిపట్టుంది.

ఆయన ఓ సినిమాలో పాట కూడా పాడారు. ఆ చిత్రం పేరు ‘జోష్‌’. నాగచైతన్య హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన సినిమా ఇది. ఈ మూవీలో దిల్‌ రాజు ‘ అన్నయ్యొచ్చినాడో.. వెలుగుల వెన్నెల్‌ తెచ్చినాడో…’’ అనే పాటను పాడారు. ఈ పాట అప్పట్లో చాలా ఫేమస్‌ అయింది. అంతేకాదు.. దిల్‌ రాజు పలు ఫంక్షన్లలో కూడా పాటలు పాడుతూ ఉంటారు. తను నిర్మాణ బాధ్యతలు చేపట్టే సినిమా పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. లిరిక్స్‌ను మార్చేంత నాలెడ్జ్‌ దిల్‌ రాజుకు ఉందంటే.. పాటలపై ఆయనకున్న పట్టేంలో అర్థం అవుతుంది..

దిల్‌ రాజు సింగింగ్‌ టాలెంట్‌కు దిగ్గజ సీనియర్‌ దర్శకుడు కే రాఘవేంద్రరావే ఆశ్చర్యపోయారు. కాగా, దిల్‌రాజు తాజాగా యానిమల్‌ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కుల్ని కొన్నారు. నైజాం, సీడెడ్‌, ఆంధ్రలకు గాను దాదాపు 15 కోట్ల రూపాయలు పెట్టి చిత్రాన్ని కొన్నారు. యానిమల్‌ డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంచలన విజయాన్ని నమోదు చేసింది. తెలుగుతో పాటు విడుదలైన అన్ని భాషల్లో దుమ్ములేపుతోంది. ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. దిల్‌ రాజు 15 కోట్లకు సినిమాను కొనగా.. బ్రేక్‌ ఈవెన్‌ 16 కోట్లుగా ఉండింది. ఈ పాటికే ఆ బ్రేక్‌ ఈవెన్‌ దాటిపోయి ఉండొచ్చు. లాభాలు సైతం వస్తుంటాయి. మరి, దిల్‌ రాజు సింగింగ్‌ టాలెంట్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments