12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో.. ఇండస్ట్రీ హిట్టు కొట్టిన స్టార్ హీరో! ఆ మూవీ ఏదంటే?

ఓ సినిమా కథను ఏకంగా 12 స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. ఇక అదే కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపించాడు ఓ హీరో, దర్శకుడు. మరి 12 రిజెక్ట్ చేసిన ఆ మూవీ ఏది? ఆ దర్శకుడు ఎవరు? ఆ హీరో ఎవరు? తెలుసుకుందాం పదండి.

ఓ సినిమా కథను ఏకంగా 12 స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. ఇక అదే కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపించాడు ఓ హీరో, దర్శకుడు. మరి 12 రిజెక్ట్ చేసిన ఆ మూవీ ఏది? ఆ దర్శకుడు ఎవరు? ఆ హీరో ఎవరు? తెలుసుకుందాం పదండి.

డైరెక్టర్లు కొంత మంది హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తూ ఉంటారు. ఇక స్టోరీ పూర్తి అవ్వగానే.. తన మైండ్ లో ఉన్నహీరోకి వెళ్లి కథ వినిపిస్తాడు. అయితే ఆ కథ ఆ హీరోకి నచ్చకపోతే.. మరో హీరోని వెతుక్కుంటాడు సదరు డైరెక్టర్. ఇక ఎలాంటి స్టోరీ అయినా.. ఒక్కరు లేదా ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేస్తుంటారు. మహా అయితే.. ముగ్గురు చేస్తారు. కానీ ఓ కథను ఏకంగా 12 స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. ఇక అదే కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపించాడు ఓ హీరో, దర్శకుడు. మరి 12 రిజెక్ట్ చేసిన ఆ మూవీ ఏది? ఆ కథతోనే హిట్టు కొట్టిన ఆ హీరో ఎవరు? ఆ డైరెక్టర్ ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక హీరోకి కథ నచ్చకపోవడంతో.. మరో హీరో దగ్గరికి ఆ స్టోరీలు వెళ్తూ ఉంటాయి. అలా వెళ్లిన కథల్లో కొన్ని హిట్లుగా నిలిస్తే.. మరికొన్ని డిజాస్టర్లుగా మిగిలిపోతాయి. అలా ఓ కథను ఏకంగా 12 మంది హీరోలు రిజెక్ట్ చేశారట. ఇంత మంది వద్దు అన్నాక ఆ మూవీ మూలనపడి ఉంటుందని చాలా మంది అనుకుని ఉంటారు. కానీ ఆ స్టార్ డైరెక్టర్ పట్టువదలని విక్రమార్కుడిలా దాన్ని తెరకెక్కించి.. ఇండస్ట్రీ హిట్టు కొట్టేదాక నిద్రపోలేదు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. ఏఆర్ మురగదాస్. ఆ 12 స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన మూవీ గజినీ. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం 2005లో విడుదల అయ్యి.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అయితే గజినీ మూవీ సూర్య దగ్గరకు రావడానికి ముందే.. 12 మంది హీరోల దగ్గరికి వెళ్లిందట. కానీ ఆ 12 మంది ఈ కథను రిజెక్ట్ చేసినట్లు స్వయంగా ఏఆర్ మురగదాస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫస్ట్ ఈ స్టోరీని తెలుగు హీరోతోనే చేయాలని అనుకున్నాడట. దాంతో వెంటనే స్టోరీ కంప్లీట్ అవ్వగానే సూపర్ స్టార్ మహేశ్ కు నెరేషన్ ఇచ్చాడట. మహేశ్ కు స్టోరీ నచ్చినప్పటికీ.. హీరో ఒంటి నిండా పచ్చబొట్లతో కనిపించాలనడంతో… రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత స్టోరీలో కొన్ని మార్పులు చేసి.. విశ్వనటుడు కమల్ హాసన్ కు చెప్పాడట. అతడు కూడా నో అనడంతో.. స్టోరీని పట్టుకుని పాదయాత్ర ప్రారంభించాడట మురుగదాస్.

ఈ క్రమంలోనే వరుసగా రజినీకాంత్, విజయ్ కాంత్, దళపతి విజయ్ లాంటి మెుత్తం 12 మంది హీరోలకు కథను వినిపించాడట. కానీ వారందరు రిజెక్ట్ చేయడంతో.. ఇక లాభం లేదని తనకు తొలి సినిమా ఛాన్స్ ఇచ్చిన అజిత్ కు గజినీ స్టోరీ చెప్పాడు. అతడికి ఈ కథ నచ్చడంతో.. చకచకా మూవీ షూటింగ్ కు వెళ్లింది. రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి అయ్యాయి. కానీ ఇంతలోనే ప్రొడ్యూసర్ కు అజిత్ కు మధ్య అభిప్రాయా భేదాలు రావడంతో.. సినిమా ఆగిపోయింది. కానీ మురుగదాస్ లో కసి మరింతగా పెరిగింది. ఎలాగైనా సినిమా చేయాలని పట్టుపట్టాడు.

ఇలాంటి టైమ్ లో అప్పుడే తమిళంలో మంచి మార్కెట్ ను సంపాదిస్తున్న సూర్యకు ఈ స్టోరీని చెప్పాడు. అది అతడికి నచ్చడం.. షూటింగ్ పూర్తి చేసుకోవడం అంతా స్పీడ్ గా జరిగిపోయి.. 2005లో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. తెలుగులో సైతం గజినీ మూవీ ఊహించని సక్సెస్ ను సాధించింది. దాంతో సూర్యకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. ఎన్నో అవంతరాలు దాటుకుని మరీ సక్సెస్ కొట్టింది గజినీ మూవీ. మరి 12 హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments