Swetha
Dhanush Vs Prabhas: ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ హీరో స్పీడ్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. దాదాపు ఇప్పటివరకు ఎవరు పోటీకి వచ్చింది లేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ కు పోటీగా ధనుష్ రాబోతున్నాడు. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.
Dhanush Vs Prabhas: ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ హీరో స్పీడ్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. దాదాపు ఇప్పటివరకు ఎవరు పోటీకి వచ్చింది లేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ కు పోటీగా ధనుష్ రాబోతున్నాడు. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.
Swetha
ప్రభాస్ మూవీ రిలీజ్ ఉందంటే .. దానికి పోటీగా మరో మూవీ రిలీజ్ చేయాలనే ఆలోచన ఎవరికీ రాదు. దర్శక నిర్మాతలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. థియేటర్స్ సమస్యతో పాటు.. అటు ఓపెనింగ్స్ కూడా దెబ్బ తింటాయనే ఉద్దేశంతో సేఫ్ గా వారి సినిమాలు రిలీజ్ చేస్తారు. ఎప్పుడో వచ్చిన బాహుబలి దగ్గర నుంచి మొన్న వచ్చిన కల్కి వరకు చూస్తినట్లైతే.. ప్రభాస్ కు ఏనాడు ఎవరు కాంపిటీషన్ కు రాలేదు . ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ హీరో స్పీడ్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ స్పీడ్ ను మ్యాచ్ చేసే వారే లేరని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. సరే అదంతా నిజమే కానీ.. ఈసారి అలా జరిగేలా లేదు. డార్లింగ్ కు పోటీగా సవాల్ విసిరేందుకు ఇతర హీరోలు రెడీ అవుతున్నారు. వారిలో ఇప్పుడు మెయిన్ గా వినిపిస్తున్న పేరు కోలీవుడ్ స్టార్ ధనుష్.
ఎప్పుడు లేనిది ఇప్పుడు సడెన్ గా డార్లింగ్ కు ధనుష్ పోటీ ఏంటా అనుకుంటున్నారా. ధనుష్ కు ఒక హీరోగానే కాకుండా ఒక దర్శకుడిగా కూడా మంచి పేరు ఉంది. ఇప్పుడు మరోసారి మరో కథతో ధనుష్ రాబోతున్నాడు. తన ఓన్ డైరెక్షన్ లో ఇడ్లి కడాయ్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అది డార్లింగ్ డేట్. రాజాసాబ్ సినిమా రిలీజ్ డేట్ ఏప్రిల్ 10 అంటూ ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది. దాదాపు సినిమా షూటింగ్ కూడా పూర్తికావొస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తూనే ఉన్నాయి . మరో వైపు ధనుష్ ఇడ్లీ కడాయ్ మూవీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుందట. ఒక రాత్రి , తెల్లవారుఝామున జరిగే సంఘటనలతో.. ధనుష్ సింగిల్ లొకేషన్ లో ఈ మూవీ షూటింగ్ పూర్తిచేశాడట . ధనుష్ కథలెప్పుడు చాలా లోతుగా ఉంటాయి. ఆ ఎమోషన్స్ ప్రేక్షకులను ఇట్టే లొంగతీసుకుంటాయి.
అయితే ఈ ఇద్దరి హీరోలకు ఎవరి ఇమేజ్ వారికుంది. ఇప్పుడు రాజాసాబ్ కు పోటీగా ధనుష్ రావడం వలన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఇబ్బందేం లేదు. కానీ తమిళనాడు, కేరళ ఓపెనింగ్స్ పై మాత్రం ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ మధ్యన ధనుష్ నుంచి వచ్చిన రాయన్ మూవీ.. కమర్షియల్ గా డీసెంట్ సక్సెస్ అందుకుంది. డైరెక్టర్ గా ధనుష్ ఫెయిల్ అవ్వలేదనే కామెంట్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఇడ్లి కడాయ్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ మూవీలో కమర్షియల్ అంశాలు తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇలాంటి మూవీ రాజాసాబ్ లాంటి గ్రాండియర్ హారర్ తో పోటీకి రావడం విచిత్రం. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.