iDreamPost
android-app
ios-app

Devara: దేవర గ్లింప్స్.. తారక్ విశ్వ రూపం! సౌండ్ బాక్స్ లు అదిరిపోయాయి!

  • Published Jan 08, 2024 | 4:13 PM Updated Updated Jan 08, 2024 | 4:18 PM

Devara Part -1 Glimpse Review: దేవర సినిమా ప్యాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోంది. 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Devara Part -1 Glimpse Review: దేవర సినిమా ప్యాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోంది. 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

  • Published Jan 08, 2024 | 4:13 PMUpdated Jan 08, 2024 | 4:18 PM
Devara: దేవర గ్లింప్స్.. తారక్ విశ్వ రూపం! సౌండ్ బాక్స్ లు అదిరిపోయాయి!

జూనియర్‌ ఎన్టీఆర్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ దేవర ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం శరావేగంగా సాగుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. 2024 ఏప్రిల్‌ 5 న మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, సినిమాకు సంబంధించి సోమవారం సాయంత్రం ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల అయింది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

విడుదలైన నిమిషాల్లోనే లక్షల వ్యూస్‌ సంపాదించింది. గ్లింప్స్‌లో జూనియర్‌ మాస్‌ విశ్వరూపం కనిపిస్తోంది. మొన్న  గ్లింప్స్‌కు సంబంధించి ఓ చిన్న వీడియో విడుదల అయింది. ఆ వీడియో కూడా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. అందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ రక్తంతో తడిసిన తన కత్తిని నీటిలో కడుగుతూ ఉన్నాడు. ఈ వీడియోతో గ్లింప్స్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఫ్యాన్స్‌ ఊహించిన దానికంటే అద్భుతంగా గ్లింప్స్‌ ఉంది.

గ్లింప్స్‌ ఎలా ఉందంటే.. 

గ్లింప్స్‌ సముద్రంలో పడవ ప్రయాణంతో మొదలవుతుంది. సముద్రం షాట్లు, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌.. గూస్‌బమ్స్‌ తెప్పిస్తాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంట్రీతో రచ్చ మొదలవుతుంది. కత్తులతో ఆయన చేసే పోరాటాలు నెత్తుటి ఏరులు పారిస్తూ ఉంటాయి. ఈ సముద్రం చేపల్ని కంటే.. కత్తుల్ని.. నెత్తుర్నే ఎక్కువ చూసింది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం  అని అంటారు’ అన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ డైలాగ్‌తో గ్లింప్స్‌ ముగుస్తుంది. మొత్తానికి ప్రతీ ఫ్రేము హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంది. జూనియర్‌ ఖాతాలోకి ఓ సూపర్‌ హిట్‌ ఖాయం.

కాగా, దేవరలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు. తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా చేస్తున్నారు. తాజాగా, జూనియర్‌-సైఫ్‌ల మధ్య యాక్షన్‌ సీక్వెన్స్‌లు తెరకెక్కించినట్లు సమాచారం. మరి, జూనియర్‌ ఎన్టీఆర్‌ – కొరటాల శివల కాంబో ‘దేవర’ గ్లింప్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet