Venkateswarlu
రణబీర్ కపూర్-సందీప్‌రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో లేని సీన్ ఒకటి వైరల్‌గా మారింది.
రణబీర్ కపూర్-సందీప్‌రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో లేని సీన్ ఒకటి వైరల్‌గా మారింది.
Venkateswarlu
భారీ అంచనాల నడుమ డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ‘ యానిమల్’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 3:21 నిమిషాలు ఉన్నా కూడా చిత్రం మెప్పించి విజయం సాధించింది. విమర్శకులు సైతం యానిమల్‌కు మంచి రివ్యూలు ఇచ్చారు. చిత్రం కేవలం తెలుగులోనే కాదు.. విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. మొదటి రోజు కలెక్షన్ల వరద పారించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో.. ఓవర్ సీస్‌లో వసూళ్లు భారీగా వచ్చాయి.
దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రణబీర్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 4000లకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఒక్క భారతదేశంలోనే 65 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇక, ప్రపంచవ్యాప్తంగా 100 నుంచి 105 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ముందెన్నడూ.. ఏ సినిమా రానంతగా ఓవర్‌సీస్‌లో ఏకంగా 40 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి.
ఇక, సినిమా నిడివి, సెన్సార్ కట్స్ విషయానికి వస్తే.. మొదటగా సెన్సార్ కోసం సినిమా టీం 3:23 నిమిషాల నిడివి ఉన్న చిత్రాన్ని పంపంది. మూవీ చూసిన సెన్సార్ టీం మొత్తం ఐదు కట్స్, మార్పులను సూచించింది. కొన్ని సీన్లను, డైలాగ్‌లను తీసేయాలని తెలిపింది. దీంతో 3:23 నిమిషాల నిడివి కాస్తా 3:21 నిమిషాలకు పడింది. అంతేకాదు! ట్రైలర్ కట్‌లో ఉన్న కొన్ని సీన్లు కూడా సినిమా థియేటర్లలో ప్రదర్శితం కాలేదు. సెన్సార్ చేసిన వీడియో అయి ఉండొచ్చని తెలుస్తోంది.
ట్రైలర్‌లో రణబీర్ తన ప్రైవేట్ చాటెడ్ ఫ్లైట్‌లో అనుచరలతో కలిసి ఉంటాడు. నల్లటి దుస్తుల్లో ఒళ్లంతా గాయాలతో, రక్తంతో భయంకరంగా కనిపిస్తాడు. గ్లాసులో మందు పోసుకుని, విమానం కాక్‌పీట్ దగ్గరకు వస్తాడు. పైలెట్ పక్కకు పంపి అతడు అందులో కూర్చుంటాడు. సిగరెట్ తాగుతూ విమానం నడుపుతాడు. ఈ సీన్ అద్బుతంగా ఉన్నా కూడా సెన్సార్ కట్ చెప్పినట్లు తెలుస్తోంది. డిలీట్ అయిన ఈ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..
‘‘ ఈ సీన్ థియేటర్లలో ఉండి ఉంటే గూస్‌బమ్స్ వచ్చేవి’’.. ‘‘ ఇలాంటి సీన్లను సెన్సార్ ఎందుకు ఉండనివ్వదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. దాదాపు 15 కోట్ల రూపాయలు పెట్టి సినిమా కొన్నారు. ఒకరోజులోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. మరి, సెన్సార్ బోర్డు కట్ చెప్పిన ఈ సీన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Deleted Scene from #Animal
— Christopher Kanagaraj (@Chrissuccess) December 2, 2023