జైల్లో దర్శన్‌ని కలిసిన తల్లి.. ఒక్కసారే దుఖాఃన్ని ఆపుకోలేకపోయాడు..

Renuka Swamy Murder: కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితులుగా ప్రముఖ హీరో దర్శన్ తుగ్‌దీప్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే.

Renuka Swamy Murder: కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితులుగా ప్రముఖ హీరో దర్శన్ తుగ్‌దీప్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే.

కన్నడ ఇండస్ట్రీలో చాలెంజింగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు దర్శన్ తుగ్‌దీప్ తన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్ లు పంపుతున్నాడన్న కారణంతో చిత్ర దుర్గంలో ఉండే 33 ఏళ్ల రేణుకాస్వామి అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హింసించి హత్య చేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటి పవిత్ర గౌడ ను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.రేణుకాస్వామి హత్య వ్యవహారం షాండిల్‌వుడ్‌లో సంచలనం సృష్టించింది. దర్శన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైల్లో ఉన్న దర్శన్ ని కలిసేందుకు వచ్చిన తల్లిని చూసి ఎంతో ఎమోషన్ అయినట్లు వార్తలు వస్తుున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

తన అభిమానికి అత్యంత దారుణంగా హింసించి చంపిన కేసులో కన్నడ ఛాలెంజిగ్ హీరో దర్శన్ తుగ్‌దీప్ అతని ప్రియురాలు పవిత్ర గౌడ తో పాటు మరో 15 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం వీరంతా బెంగుళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్నారు. దర్శన్ ని కలిసేందుకు తల్లి మీనా, సోదరుడు దినకర్, భార్య విజయ లక్ష్మితో పాటు కుమారుడు వినీష్ వెళ్లారు. చాలా రోజుల తర్వాత తన కుటుంబాన్ని చూసి దర్శన్ చాలా ఎమోషన్ అయ్యారు. దర్శన్ సతీమణి విజయలక్ష్మి, కొడుకు వినీష్ చూసిన ఎమోషన్ అయ్యాడు. ఆ తర్వాత తన తల్లిని చూడగానే దర్శన్ తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చేసినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో సోదరుడు దినకర్ ఇద్దరినీ ఓదార్చినట్లు తెలుస్తుంది.

కన్నడ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన దర్శన్ తర్వాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అభిమానులు ఆయన్ని ఛాలెంజింగ్ హీరో గా పిలుస్తారు. కన్నడ ఇండస్ట్రీలో దర్శన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఫ్యాన్స్ లో ఒకరు రేణుకాస్వామి. ఆ అభిమానం అతని పర్సనల్ లైఫ్‌లో జోక్యం చేసుకునేలా చేసింది. తన అభిమాన హీరో దర్శన్ భార్యతో కాకుండా పవిత్ర గౌడతో ఉండటం సహించలేకపోయిన రేణుకాస్వామి ఆమెకు అసభ్య మెసేజ్ లు పెట్టినట్లు సమాచారం. ఈ కారణంగానే అతనిపై కోపంతో రగిలిపోయిన పవిత్ర గౌడ, దర్శన్ తో పాటు మరో 15 మంది రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. ఈ క్రమంలోనే దర్శన్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు దర్శన్ కు జులై 4 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దర్శన్ అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారిగా కుటుంబ సభ్యులు వెళ్లి పరామర్శించారు.. ఈ సందర్బంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Show comments