nagidream
Star Hero Simplicity: ఎంత ఎత్తుకు ఎదిగినా స్టార్ హీరోలు చాలా ఒదిగి ఉంటారు. క్రమశిక్షణతో ఉంటారు. అలాంటి వారిలో ఈ స్టార్ హీరో ఒకరు. ఈయన డబ్బు కోసం పరుగులు పెట్టరు. డబ్బు మనిషి కాదు. చెప్పిన టైం కంటే ముందుగానే లొకేషన్ లో వచ్చి కూర్చుంటారు. ఆ స్టార్ హీరో ఎవరంటే?
Star Hero Simplicity: ఎంత ఎత్తుకు ఎదిగినా స్టార్ హీరోలు చాలా ఒదిగి ఉంటారు. క్రమశిక్షణతో ఉంటారు. అలాంటి వారిలో ఈ స్టార్ హీరో ఒకరు. ఈయన డబ్బు కోసం పరుగులు పెట్టరు. డబ్బు మనిషి కాదు. చెప్పిన టైం కంటే ముందుగానే లొకేషన్ లో వచ్చి కూర్చుంటారు. ఆ స్టార్ హీరో ఎవరంటే?
nagidream
సినిమా అంటే సక్సెస్, అంకితభావం, క్రమశిక్షణ, ఓటమి, ఓర్పు, నేర్పు, కష్టాలు, నష్టాలు ఇలా చాలా ఉంటాయి. అయితే వీటన్నిటి విషయంలో ఎప్పుడూ ఒకేలా ఉండేవారే నిజమైన హీరో. కష్టాలు, సుఖాలు, ఫెయిల్యూర్స్, సక్సెస్ ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. ఉరుమొచ్చినా, మెరుపొచ్చినా ఆకాశం అక్కడే ఉన్నట్టు మనిషి కూడా ఆకాశంలానే చెక్కు చెదరకుండా ఉండాలి. కానీ ఒక సినిమా ప్లాప్ అయ్యిందని బాధపడుతూ ఉండిపోతారు కొంతమంది. ఒక సక్సెస్ పడగానే భారీగా పారితోషికం పెంచేస్తారు. అవకాశాల కోసం తిరిగిన రోజున ఆకలితో పని చేసిన వారు.. కడుపు నిండిన తర్వాత మాత్రం బిర్యానీ కోసం పేచీ పెడతారు. షూటింగ్ స్పాట్ కి టైంకి రారు. ఇలా కొంతమంది ఇండస్ట్రీలో ఉంటారు. కానీ కొంతమంది మాత్రం నిర్మాత గురించి ఆలోచిస్తారు. సినిమా పట్ల చిత్తశుద్ధితో పని చేస్తుంటారు.
అందులోనూ హీరోలు ముఖ్యంగా అంకితభావంతో ఉండాల్సిన అవసరం ఉంది. హీరోలంటే చిన్న విషయం కాదు. షూటింగ్ టైంకి లొకేషన్ లో ఉండాలి. ఆలస్యం చేస్తే నిర్మాతకు బిల్లు తడిసి మోపుడవుద్ది. అందుకే హీరోలు నిర్మాతల గురించి ఆలోచిస్తారు. కొంతమంది మాత్రం షూటింగ్ కి ఆలస్యంగా వస్తుంటారు. దీని వల్ల మిగతా ఆర్టిస్టులు, దర్శక, నిర్మాతలు ఇబ్బందులు పడతారు. రెమ్యునరేషన్ విషయంలో కూడా చాలా ఖచ్చితంగా ఉంటారు. అడిగినంత ఇస్తేనే చేస్తా అని పట్టుపడతారు. కానీ ఈ హీరో మాత్రం షూటింగ్ టైం కంటే అరగంట ముందుగానే లొకేషన్ లో ఉంటారట. ఈ విషయాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్, నిర్మాత అహ్మద్ ఖాన్ వెల్లడించారు.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి పని చేయడమే తెలుసునని.. బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి పెద్దగా పట్టించుకోడని అన్నారు. డబ్బు వెంట పరుగులు పెట్టే మనిషి కాదని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అక్షయ్ ఎన్ని సినిమాలు చేస్తున్నా గానీ డబ్బు అవసరమై చేయడం లేదని.. డబ్బు వెంట పరిగెత్తాల్సిన అవసరం అక్షయ్ కుమార్ కి లేదని అన్నారు. అయినా గానీ సినిమాలు చేయడానికి కారణం.. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అక్షయ్ చెబుతారని అహ్మద్ ఖాన్ వెల్లడించారు. చేతిదాకా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని, ఇదే ఆఖరి అవకాశం అని చేసుకుంటూ పోవాలని.. అందుకోసం ఎంతైనా కష్టపడాలని అక్షయ్ చెబుతుంటారని అన్నారు.
తాను చేసే పనిని గౌరవించే మనిషి అక్షయ్ కుమార్ అని.. సినిమా కోసం పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఆలోచిస్తారని. కానీ కలెక్షన్స్ గురించి, మూవీ రిజల్ట్ గురించి అస్సలు పట్టించుకోరని అన్నారు. ఇక షూటింగ్ సెట్స్ లో ఉదయం 7 గంటలకు ఉండాలంటే ఆరున్నరకే వచ్చి కూర్చుంటారని.. తాము ఆలస్యంగా వెళ్లినా సరే కోప్పడేవారు కాదని అన్నారు. కాగా అక్షయ్ కుమార్ నటించిన సర్ఫిర మూవీ జూలై 12న విడుదల కానుంది. ఇది సూర్య నటించిన సూరరై పోట్రు సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది.