అభిమానులంతా ఇలాంటి పరిస్థితుల్లో అండగా ఉంటారని ఆశిస్తున్నాను – చిరంజీవి

Chiranjeevi Post About current rains: నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా... ప్రజలంతా అనేక ఇబ్బందులకు గురౌతున్న సంగతి చూస్తూనే ఉన్నాము. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రజలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు.

Chiranjeevi Post About current rains: నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా... ప్రజలంతా అనేక ఇబ్బందులకు గురౌతున్న సంగతి చూస్తూనే ఉన్నాము. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రజలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచించారు. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలెర్ట్ ను జారీ చేశారు. నిన్నటినుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు రోడ్లన్నీ జలమయం కాగా.. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. దానికి సంబంధించిన విజువల్స్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అధికారులు ఓ వైపు ప్రజలను అపప్రమత్తం చేస్తుండగా.. మరో వైపు సినీ సెలెబ్రిటీలు కూడా తమ వంతు భాద్యతను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర ప్రజలను , తమ అభిమానులను ఉద్దేశిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా రాసుకొచ్చారు.. “తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను” అంటూ పోస్ట్ చేశారు. దీనితో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. కాబట్టి ప్రజలంతా వీలైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిది.

రాష్ట్రంలో ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు.. సినీ సెలెబ్రిటీలు తమ వంత బాధ్యతగా ముందుకు వచ్చి సహాయం చేస్తూనే ఉంటారు. ఇపప్టికే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే చూస్తూ వచ్చాము. ఇక ఇప్పుడు అనుకోకుండా కుండపోత వర్షాల కారణంగా ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదని.. ముందస్తు జాగ్రత్తగా అటు అధికారులు, ఇటు సెలెబ్రిటీలు ప్రజలను హెచ్చరిస్తున్నారు. రానున్న 24 గంటలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. మరి చిరంజీవి ట్వీట్ చేసిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments