చిరంజీవి మాస్టర్ మూవీ విలన్.. ఇప్పుడెలా ఉన్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ మూవీలో విలనిజంతో భయపెట్టిన ఈ నటుడు గుర్తున్నాడా..? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ మూవీలో విలనిజంతో భయపెట్టిన ఈ నటుడు గుర్తున్నాడా..? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవిలో నటుడే కాదు.. సింగర్ కూడా దాగి ఉన్నాడు. ఆయన తొలి సారిగా తన గళాన్ని విప్పిన చిత్రం మాస్టర్. ‘తమ్ముడు అరే తమ్ముడు’ సాంగ్ పాడారు. 1997లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ అందుకుంది. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించగా..గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డిటిఎస్‌లో రికార్డు చేయబడిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమాకు దేవా సంగీతం సమకూర్చాడు. ప్రతి పాట సూపర్ డూపర్ హిట్టు. తిలోత్తమా, ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టర్, బావున్నారా.. బావున్నారా సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో నగ్మా సోదరి రోషిణీ, సాక్షిశివానంద్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతోనే సాక్షి శివానంద్ టాలీవుడ్ క్రష్ బ్యూటీగా మారిపోవడమే కాదు.. బిజీ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఇక ఇందులో హీరోకే కాదు.. విలన్‌కు కూడా మంచి పేరు వచ్చింది. ఇందులో డీఆర్ అలియాస్ దేవరాజ్ పాత్రలో విలనీజానికి కొత్త అర్థం చెప్పాడు నటుడు. గుండుతో అప్పట్లో భయపెట్టేశాడు. ఇంతకు ఆయన ఎవరంటే.. పునీత్ ఇస్సార్. ఆయన 150 చిత్రాలకు పైగా విలన్ పాత్రల్లో నటించాడు. ఆయన యాక్టర్ మాత్రమే కాదు.. రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా. హిందీ, బెంగాలీ, తెలుగు, కన్నడ, మలయాళ, పంజాబీ చిత్రాల్లో యాక్ట్ చేశాడు. అలాగే టీవీ షోల్లో కూడా కనిపిస్తుంటారు. 1983లో హిందీ కూలీ మూవీతో ఆయన కెరీర్ స్టార్ట్ అయ్యింది. మహా భారత్ టెలివిజన్ సీరియల్లో ధుర్యోధన పాత్రలో మెప్పించింది పునీతే. ఈ సీరియల్ ఆయనకు మంచి ఫేమ్ ఇవ్వడమే కాకుండా వరుస సినిమాల్లో అవకాశాలను తెచ్చిపెట్టింది. అలా బాలీవుడ్ స్టార్ విలన్‍గా మారాడు.

తెలుగులో కూడా చిరుతో మాస్టర్ చేశాడు. మళ్లీ బాలీవుడ్‌లో బిజీగా అయిపోయాడు.  చిరంజీవి ఇంద్రతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో షౌకత్ అలీ ఖాన్ పాత్రలో మెరిసింది ఈ నటుడే. కానీ మాస్టర్ విలన్ ఇతడే అంటూ గుర్తు పట్టడం అసాధ్యమే. ఠాగూర్‌లో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించారు. అక్కడి నుండి వరుసగా సినిమాలు చేశారు. శ్రీహరి గురి, బాలకృష్ణ అల్లరి పిడుగు, తారక్ నరసింహుడు, చంద్రహాస్ సినిమాలు చేస్తూనే మిగిలిన భాషల్లో సినిమాలు చేశాడు. ఈ సారి చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు.  దాదాపు 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు పునీత్. శరభతో పాటు ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించాడు ఈ యాక్టర్. ఇస్మార్ శంకర్ మూవీలో కాశీ విశ్వనాథ్ పాత్రలో మెరిసింది ఈయనే. ప్రస్తుతం 64 సంవత్సరాలు వచ్చేయడంతో సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు ఈ సీనియర్ నటుడు.

Show comments