RRR, Acharya OTT చరణ్ ఒక్కడికే ఇలా జరిగింది,

ఇప్పటి జెనరేషన్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనమైపోయింది. అందులోనూ రాజమౌళి లాంటి దర్శకులతో పెట్టుకుంటే మూడు నాలుగేళ్లు కృష్ణార్పణం కాక తప్పదు. సరే థియేటర్ లో వచ్చేది అరుదు కదా దానికి తగ్గట్టే ఓటిటిలోనూ వీళ్ళ దర్శనం అంతే టైం గ్యాప్ లో ఉంటుంది. కానీ ఒక్క రామ్ చరణ్ మాత్రమే ఈ విషయంలో ఓ కొత్త రికార్డు అందుకున్నాడు. ఈ నెల 20 అంటే వచ్చే శుక్రవారం తన రెండు కొత్త చిత్రాలు ఆచార్య, ఆర్ఆర్ఆర్ ఒకే రోజు డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఆ మేరకు నిన్న అధికారిక ప్రకటనలు రావడం విశేషం. మొదటిది ప్రైమ్ లో రానుండగా ట్రిపులార్ జీ5 పే పర్ వ్యూ మోడల్ లో వస్తోంది.

రామ్ చరణ్ లాంటి మార్కెట్ ఉన్న హీరో రెండు కొత్త సినిమాలు ఇలా ఒకే రోజు ఓటిటిలో రావడం తన సమకాలీకులు ఎవరికీ జరగలేదు. ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ యాభై రోజులు పూర్తి చేసుకుంది కానీ ఆచార్య మరీ అన్యాయంగా నాలుగో వారంలోకి అడుగు పెట్టకుండానే ఇంట్లోకి వచ్చేస్తోంది. ఇంత దారుణంగా గత రెండు మూడు దశాబ్దాల్లో చిరంజీవికి డిజాస్టర్ లేదు. ఒకప్పుడు రిక్షావోడు, బిగ్ బాస్, ఎస్పి పరశురామ్ లాంటి వాటి గురించి మాట్లాడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వాటి ప్లేస్ ని ఆచార్య తీసుకుని టాలీవుడ్ లోనే అతి పెద్ద ఫ్లాపుల్లో టాప్ వన్ ప్లేస్ తీసుకుంది. ఇంకా నయం. ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్ చేయకపోవడం మంచిదయ్యింది.

ఇక ఆర్ఆర్ఆర్ గురించి తెలిసిందే. పదకొండు వందల కోట్లతో బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు. ఇప్పటికే జేబులకు చిల్లులు పెట్టుకుని నాలుగైదు వందల రూపాయల టికెట్లతో చూసేసిన సినిమాకు మళ్ళీ డబ్బులిచ్చి చూడమని జీ5 ప్లాన్ చేసుకోవడం పట్ల విమర్శలు మొదలయ్యాయి. ఇలా అయితే ఎవరూ చూడరని, రెగ్యులర్ గా అన్ని అన్ని ఓటిటి రిలీజుల మాదిరిగానే దీనికీ ఓపెన్ ఫర్ ఆల్ పెట్టమని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సరే ఇదంతా ఎలా ఉన్నా భవిష్యత్తులో ఇలా డబుల్ బొనాంజా ఓటిటి రిలీజ్ ఆఫర్ మాత్రం ఎవరికీ జరగదు. కావాలని చేసుకున్నది కాకపోయినా అలా జరిగిపోయింది అంతే

Show comments