Venkateswarlu
ప్రముఖ టాలీవుడ్ రచయితపై నిర్మాత ఒకరు కేసు పెట్టారు. ఈ మేరకు ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రముఖ టాలీవుడ్ రచయితపై నిర్మాత ఒకరు కేసు పెట్టారు. ఈ మేరకు ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Venkateswarlu
నిర్మాతకు రచయితకు మధ్య జరిగిన ఓ వివాదం పోలీస్ కేసుకు దారి తీసింది. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటూ సదరు నిర్మాత పోలీసులను ఆశ్రయించాడు. రచయితపై కేసు పెట్టాడు. తనతో పాటు చాలా మంది సినీ ప్రముఖులను కూడా రచయిత దూషించాడంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం ప్రకారం.. ప్రముఖ రచయిత రాజసింహపై ఈ కేసు నమోదైంది.
నిర్మాత కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద ఈ కేసు పెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజసింహ, నిర్మాత సుబ్రహ్మణ్య వివేకానంద ఇద్దరూ కలిసి ఓ సినిమా తీయాలని అనుకున్నారంట. కథ విషయంలో ఇద్దరి మధ్యా గొడవ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజసింహ తన కుటుంబసభ్యులకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని వివేకానంద ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాఘవేంద్ర రావు, వైవీఎస్ చౌదరి, ఠాగూర్ మధులను కూడా రాజసింహ అసభ్య పదజాలంతో దూషించాడని వివేకానంద అన్నారు.
కాగా, రాజసింహకు రచయితగా చిత్ర పరిశ్రమలో మంచి పేరుంది. ఆయన గుణశేఖర్ తెరకెక్కించిన పీరియాడికల్ డ్రామా ‘ రుద్రమదేవీ’కి మాటల రచయితగా పని చేశారు. అల్లు అర్జున్ క్యారెక్టర్ ‘గోన గన్నారెడ్డి’ పాత్రకి డైలాగులు అందించారు. ఈ పాత్రకు మాటల రచయితా అతడికి మంచి గుర్తింపు వచ్చింది. అదే క్రేజ్‌తో ఆయన దర్శకుడిగా కూడా మారాడు. ‘ ఒక్క అమ్మాయి తప్ప’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించాడు.
ఈ చిత్రం 2016 జూని 10 థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల కారణంగా ఆయన ఓసారి ఆత్మహత్యకు యత్నించారు. అప్పటినుంచి ఆయన ఎక్కువగా ఇంటికే పరిమితం అవుతున్నారు. మరి, ప్రముఖ సినీ రచయిత రాజసింహపై నిర్మాత కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద కేసు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.