పుష్ప 2 కథ అంతా విలన్స్ చుట్టూనే ఉంటుందా.. అది పెద్ద విలన్ గ్యాంగ్

Pushpa 2 : సరిగ్గా 20 రోజుల్లో పుష్ప రాజ్ థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు ఈ సినిమా మీద అంచనాలు కొలవడం ఎవరి వలన అవ్వడం లేదు. తలలు పండిన ట్రేడ్ పండితులు కూడా ఈ అంచనాలను అందుకోలేకపోతున్నారు.ఇదంతా సరే బజ్ గురించి ఎలాగూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ కథ అంతా కూడా విలన్స్ చుట్టూనే తిరుగుతుందంట.

Pushpa 2 : సరిగ్గా 20 రోజుల్లో పుష్ప రాజ్ థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు ఈ సినిమా మీద అంచనాలు కొలవడం ఎవరి వలన అవ్వడం లేదు. తలలు పండిన ట్రేడ్ పండితులు కూడా ఈ అంచనాలను అందుకోలేకపోతున్నారు.ఇదంతా సరే బజ్ గురించి ఎలాగూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ కథ అంతా కూడా విలన్స్ చుట్టూనే తిరుగుతుందంట.

సరిగ్గా 20 రోజుల్లో పుష్ప రాజ్ థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు ఈ సినిమా మీద అంచనాలు కొలవడం ఎవరి వలన అవ్వడం లేదు. తలలు పండిన ట్రేడ్ పండితులు కూడా ఈ అంచనాలను అందుకోలేకపోతున్నారు. ఆ రేంజ్ లో బజ్ అమాంతం పెరిగిపోయింది. రిలీజ్ కు ఇంకా మూడు వారాలు ఉన్నా కూడా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ఊపందుకుంటున్నాయి. కనివిని ఎరుగని స్థాయిలో 30 వేల టికెట్లకు దగ్గరగా దూసుకుపోతున్నాయి. ఈ నెంబర్స్ చూస్తుంటే.. ప్రీమియర్ సమయానికి రికార్డ్స్ ఊచకోత ఊహించడానికి కష్టమని చెప్పి తీరాల్సిందే. బెనిఫిట్ షో టికెట్స్ కోసం ఏకంగా రాజకీయ నాయకుల ప్రమేయం అవసరమయ్యేలా ఉందని టాక్. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు పుష్ప 2 మ్యానియా ఎలా ఉందో. ఇదంతా సరే బజ్ గురించి ఎలాగూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ కథ అంతా కూడా విలన్స్ చుట్టూనే తిరుగుతుందంట. పైగా ఇప్పటివరకు బన్నీ సినిమాలలో ఎప్పుడు లేనంత.. పెద్ద విలన్ గ్యాంగ్ ఈ సినిమాలో ఉండబోతుందని సమాచారం.

పుష్ప పార్ట్ 1 లో విలన్ గా బాగా హైలెట్ అయిన క్యారెక్టర్ భన్వర్ సింగ్ షెకావత్ అలియాస్ ఫహద్ ఫాసిల్. అజయ్ ఘోష్ కు కూడా స్కోప్ దక్కింది. కానీ ఆ క్యారెక్టర్ మొదటి పార్ట్ లో చనిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ సిక్వెల్ లో సునీల్, అనసూయలకు ఎక్కువ స్కోప్ దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అలాగే మొదటి పార్ట్ లో శ్రీవల్లి మీద డాలి ధనుంజయ కన్ను వేస్తాడు. అతని కాళ్ళు విరిగిన తర్వాత అతను తీర్చుకుని రివెంజ్ ఎపిసోడ్ పార్ట్ 2 లో చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడట సుకుమార్. ఇప్పుడు వీళ్ళతో పాటు ఈసారి జగపతి బాబు కూడా తోడౌతున్నాడు. మొదటి పార్ట్ లో కాసేపు కనిపించిన రావు రమేష్ ఈసారి పొలిటికల్ యాంగిల్ లో ఎక్కువ లెన్త్ దొరికిందట. ఇదంతా ఒకెత్తయితే జపాన్ ఎపిసోడ్ లో ఎదురయ్యే కొత్త విలన్స్ మరో లెవెల్ అంట. ఇలా విదేశీ నటులను ఎంపిక చేసుకోవడంలో సుక్కు మార్క్ కనిపిస్తుందని చెప్తున్నారు.

అలా మూడు గంటల పాటు సినిమా అంతా కూడా షాక్ కు గురి చేసే కంటెంట్ ఉంటుందని, పాటలు.. యాక్షన్ సిక్వెన్స్ లు ఒక దానికి మించి మరొకటి ఉంటుందని ఊరిస్తున్నారు సుకుమార్ అండ్ కో. పైగా ఎర్రచందనం స్మగ్లింగ్ లో కొత్త తరహా ఎత్తుగడలను చూపించేందుకు సుకుమార్ స్పెషల్ రీసెర్చ్ కూడా చేశాడట. సో మొత్తానికి సినిమా అంత కంప్లీట్ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉండబోతుందని అర్ధమౌతుంది. ఇప్పటివరకు వచ్చిన హైప్ ఒక లెక్కైతే ట్రైలర్ తర్వాత క్రియేట్ అయ్యే హైప్ మరో లెవెల్. అభిమానులు బోలెడు సర్ప్రైజ్ లకు రెడీ అవ్వాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments