బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్.. ఎందుకో తెలుసా?

Bigg Boss Beauty Arrested: బుల్లితెరపై వస్తున్నా బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బిగ్ బాస్ లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ కి బయట విపరీతంగా ఫాలోయింగ్ పెరుగుతుంది.

Bigg Boss Beauty Arrested: బుల్లితెరపై వస్తున్నా బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బిగ్ బాస్ లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ కి బయట విపరీతంగా ఫాలోయింగ్ పెరుగుతుంది.

బాలీవుడ్ బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పుడు ఇతర భాషల్లో కూడా వస్తుంది. హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ చేస్తున్నారు. తెలుగులో నాగార్జున, కన్నడ లో కిచ్చ సుదీప్, మలీవుడ్ లో మోహన్ లాల్, తమిళ్ లో కమల్ హాసన్ బిగ్ బాస్ కి హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కొంతమంది నటీనటులు బిగ్ బాస్ తో ఫేమ్ అయిన తర్వాత సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ మంచి ఆదరణ పొందుతున్నారు. కొందరు మాత్రం ఎదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఓ వివాదాస్పద కేసులో బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

కన్నడ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 కంటెస్టెంట్ సోనూ శ్రీనివాస్ గౌడ ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బిడ్డను చట్టబద్దంగా దత్తత తసుకోకుండా అక్రమంగా దత్తత తీసుకోవడమే అరెస్ట్ కి కారణం అని తెలుస్తుంది. సాధారణంగా పిల్లలను దత్తత తీసుకోవడంలో అనేక ప్రక్రియలు ఉంటాయి. కానీ సోనూ శ్రీనివాస్ మాత్రం ఏ ఒక్క రూల్ పాటించలేదని ఆమెపై అభియోగం మోపబడింది. బైదరహళ్లిలోని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో  బెంగుళూరులోని బైదరహళ్లి  గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇటీవల సోను శ్రీనివాస్ గౌడ్ సోషల్ మీడియాలో సెవంత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమెపై రక రకాలుగా ట్రోలింగ్ చేశారు నెటిజన్లు. ఈ మధ్య కొంతమంది నటీనటులు సింపతి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ దత్తత ప్రక్రియ చట్టవిరుద్దమని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే9 రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారి గీత బైదరహళ్లి పోలీస్ స్టేషన్ లో జేజే చట్టం కింద ఫిర్యాదు చేశారు. చైల్డ్ వెల్ఫేర్ సమక్షంలో, జిల్లా కలెక్టర్ సమక్షంలో పిల్లలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. హిందూ దత్తత చట్టం, 1956 ప్రకారం దత్తత ప్రక్రియ జరగలేదు. కానీ సోను ఆ పని చేయలేదు.. సోషల్ మీడియాలో పాపతో ఫోటోలు షేర్ చేయడంపై ఈ వివాదం మొదలైంది. ఇలా ఎన్నో ఫిర్యాదులు ఆమెపై వచ్చాయి. ఈ పథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

 

Show comments