Keerthi
Actor Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో గత కొన్ని రోజులుగా జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో దర్శన్ పై మరీంత ఉచ్చు బింగించేలా కనిపిస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం.
Actor Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో గత కొన్ని రోజులుగా జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో దర్శన్ పై మరీంత ఉచ్చు బింగించేలా కనిపిస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం.
Keerthi
ప్రముఖ కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అతిని ప్రియురాలు పవిత్ర గౌడ్ ఇప్పటికే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందుతులుగా జైలు జీవితం గడుపుతున్నారు. ముఖ్యంగా ఈ కేసులో పలు కీలక ఆధారాలు లభ్యం కావడంతో ఈ హత్య చేయించింది దర్శన్ అని పోలీసులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఈ కేసుకు సంబంధించి బలమైన సాక్ష్యలు, నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా.. ఈ కేసు విషయంలో ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు,నెటిజన్స్ దర్శన్ పై దుమ్మెత్తిపోశారు. తప్పు చేసిన వారిని విడిచిపెట్టకూడదని తగిన శిక్ష పడేలా చూడాలని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింద. ఇదిలా ఉంటే..ప్రస్తుతం ఈ హత్య కేసులో నిందుతుడిగా బళ్లారీ జైల్లో ఉన్న దర్శన్ పై తాజాగా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖాలు చేశారు. ఆ వివరాలేంటో చూద్దాం.
కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో గత కొన్ని రోజుల క్రితం పరప్పన అగ్రహార జైల్లో ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే జైల్లో ఉన్న దర్శన్ కు రాచమర్యాదాలు జరుగుతున్నయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కోర్డు ఆదేశాల మేరకు.. పరప్పన ఆగ్రహార జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య దర్శన్ ను బళ్లారి జైలుకు పోలీసులు తరలించిన విషయం తెలిసిందే. ఇకపోతే బళ్లారీ లో జైలు జీవితం గడుపుతున్న దర్శన్ కు జ్యుడిషయల్ కస్టడీ ఈ సెప్టెంబర్ 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే దర్శన్ కు మరిన్ని కఠిన శిక్షలు పడేలా బెంగళూరు పోలీసులు బుధవారం కేసుకు సంబంధించి దాదాపు 200కు పైగా ఆధారాల్ని సేకరించింది.
వాటిలో దర్శన్ తో పాటు ఇతర నిందితులు ధరించిన దుస్తులపై రక్తపు మరకల ఫోరెన్సిక్ రిపోర్ట్ లు సైతం ఉన్నాయి. అంతేకాకుండా..నేరం జరిగిన ప్రదేశం నుంచి తీసిన ఫోటోలు, అలాగే రేణుకా స్వామి తనని కొట్టవద్దని వేడుకుంటున్న సీసీటీవీ పుటేజితో పాటు, దాడి చేసే సమయంలో నటి పవిత్ర గౌడ చెప్పులకు అంటిన రక్తపు మరకల తాలూకు ఆధారాల్ని కూడా పోలీసులు సేకరించారు. ఇక వాటిని ఛార్జ్ షీట్ లో జత చేశారు. అయితే మొదటి నుంచి ఈ కేసులో బలమైన ఆధారాలు లభ్యం కావడంతో దర్శన్ కనీసం బెయిల్ కూడా వచ్చే దాఖలు లేకుండా పోయింది. పైగా రోజు రోజుకి ఈ కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి రావడంతో దర్శన్ చూట్టు ఉచ్చు బిగించేలా కనిపిస్తోంది. ఇకోపోతే ఈ కేసులో దర్శన్ తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడ్, మరో 15 మందని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరీ, అభిమాని కేసులో దర్శన్ పై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖాలు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.