P Krishna
Actress Riya Barde Arrested: ఈ మధ్య కాలంలో పరాయి దేశానికి చెందిన వారు నకిలీ పత్రాలు సృష్టించి దొంగ పాస్‌పోర్ట్ పొంది భారత్ లోకి చొరబడుతున్న విషయం తెలిసిందే. పోలీసులు అప్రమత్తం కావడంతో వారిని అరెస్ట్ చేస్తున్నారు.
Actress Riya Barde Arrested: ఈ మధ్య కాలంలో పరాయి దేశానికి చెందిన వారు నకిలీ పత్రాలు సృష్టించి దొంగ పాస్‌పోర్ట్ పొంది భారత్ లోకి చొరబడుతున్న విషయం తెలిసిందే. పోలీసులు అప్రమత్తం కావడంతో వారిని అరెస్ట్ చేస్తున్నారు.
P Krishna
పొరుగు దేశం అయిన బంగ్లాదేశ్ ఇంకా రగిలిపోతూనే ఉంది. తమ దేశంలో ఉంటే ప్రాణాలకు ముప్పు అని భావించిన వందలాది మంది బంగ్లాదేశీయులు ఆశ్రయం కోరుతూ పక్కనే ఉన్న భారత్ సరిహద్దుకు చేరుకుంటున్నారు. మరోవైపు సరిహద్దు మొత్తం ఇనుక కంచెతో మూసి వేసినట్లు భారత్ లోకి ప్రవేశించడం కష్టం అని బీఎస్ఎఫ్ దళాలు చెబుతున్నారు. కొంతమంది డబ్బు, ఫేమ్ ఉన్నవాళ్లు నకిలీ పాస్ పోర్ట్ ద్వారా భారత్ లోకి ప్రయత్నాలు చేశారు. తాజాగా బంగ్లా ఫేమస్ ఫో*ర్న్ స్టార్ రియాను అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. ఇంతకూ ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..
బంగ్లాదేశ్ ఫో*ర్న్ స్టార్ రియా బర్దేను ముంబాయి పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ కి చెందిన నటి రియా బర్దే భారత్ కు వచ్చి నకిలీ ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ తో ఉంటున్నట్లుగా ఫిర్యాదు అందడంతో థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రియా అలియాస్ ఆరోహితో పాటు ఆమె తల్లి, తోబుట్టువులను అదుపులోకి తీసుకున్నారు. రియా తల్లి ఇందుకోసం అమరావతికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రియా బంగ్లాదేశ్ నటి, మహారాష్ట్రలో హిందువుగా తన కుటుంబంతో నివసిస్తుంది. పరిశ్రమలో రియా బర్దే ను బన్నా షేన్, ఆరోహి బర్దే అని కూడా పిలుస్తారు.ఈమె ఎన్నో సీ గ్రేడ్ సినిమాల్లో నటించింది. రియా కుటుంబం.. రుబీ షేక్, తండ్రి అరవింద్ బర్డే, సోదరుడు రవీంద్ర అలియాస్ రియాజ్ షేక్, సోదరి రీతూ అలియాస్ మోనీ షేక్ లపై పోలీసులు ఆరోపణలు వచ్చాయి. వీరిపై ఐపీసీ సెక్షన్ 420,465,468,479,34,14 ఏ కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి సంగ్రామ్ మల్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. రియా చాలా ప్రొడక్షన్ హౌస్ లతో సంబంధం కలిగి ఉందని, ఆమె తల్లి అంజలి పశ్చిమ బెంగాల్ కు చెందినదని చెప్పకుంటూ.. అమరావతికి చెందిన అరవింద్ బర్డేను పెళ్లి చేసుకుంది. తర్వాత.. జనన, ఇతర నకిలీ పత్రాలను తనకోసం, పిల్లల కోసం తయారు చేయించి భారతీయ పాస్ పోర్ట్ లను తయారు చేశారు. అయితే రియా బంగ్లాదేశ్ కు చెందినదని, అక్రమంగా భారత్ లో నివసిస్తుందని రియా స్నేహితుడు ప్రశాంత్ మిశ్రాకు తెలియడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే పోలీసులు పూర్తిగా ఎంక్వేయిరీ చేయి ఆమె పత్రాలను పరిశీలించి అసలు విషయం బయటపెట్టారు. ఈ నేపథ్యంలో రియాతో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశామని అన్నారు పోలీసులు.