Dharani
రేవ్ పార్టీ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక్కడ పట్టుబడిన వారికి రక్త పరీక్షలు నిర్వహించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
రేవ్ పార్టీ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక్కడ పట్టుబడిన వారికి రక్త పరీక్షలు నిర్వహించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
Dharani
బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ పార్టీలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారంటూ వార్తలు వచ్చాయి. సుమారు 100-150 మంది వరకు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలిసింది. ఇక రేవ్ పార్టీ అంటే ఏంటి.. దాని ఎంట్రీ ఫీజు ఎంత.. అక్కడ ఎలాంటి గబ్బు పనులు జరుగుతాయి అనే దానికి సంబంధించి మీడియా, సోషల్ మీడియాలో బోలేడు వార్తలు వస్తున్నాయి. వాటిని చదివిన జనాలు.. రేవ్ పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలను చీత్కారంతో చూస్తున్నారు.
ఇక తెలుగు సీనియర్ నటి హేమ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే తాను ఆ పార్టీలో లేనని చెప్పుకోవడం కోసం హేమ చేసిన ప్రయత్నాలు అన్ని బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఏకంగా బెంగళూరు పోలీసులే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
రేవ్ పార్టీలో డ్రగ్స్ కూడా వినియోగించినట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఈ క్రమంలో పార్టీలో పట్టుబడిన వారి రక్తనమూనాలు సేకరించి.. పరీక్షల కోసం పంపించారు. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నార్కోటిక్ అధికారులు ఈ పార్టీలో పాల్గొన్న 150 మంది రక్త నమూనాలు సేకరించి.. టెస్ట్ చేశారు. తాజాగా అందరి రక్త నమూనా రిపోర్ట్‌లు వచ్చాయని కర్ణాటక పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తెలుగు నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. దాంతో తాను అసలు రేవ్ పార్టీకి వెళ్లలేదు అని అందరిని నమ్మించే హేమ ప్రయత్నాలకు ఈ రిపోర్ట్‌తో చెక్ పడింది.
రేవ్ పార్టీలో తెలుగు సినిమా నటి హేమ పేరు వచ్చిన వెంటనే ఆమె జాగ్రత్త పడింది. పార్టీ జరిగిన ఫామ్ హౌస్ ఖాళీ స్థలంలోకి వెళ్లి.. తాను రేవ్ పార్టీ జరిగే ప్రాంతంలో లేను.. హైదరాబాద్‌లోని తన ఫామ్ హౌస్‌లో ఉన్నట్లు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే పోలీసులు విడుదల చేసిన ఫొటో.. హేమ రిలీజ్ చేసిన వీడియోలోని ఫుటేజ్‌లో ఆమె ధరించిన డ్రెస్ రెండూ ఒకటే కావడంతో ఆమె అబద్దం చెప్పినట్లు స్పష్టం అయ్యింది.
అంతేకాక బెంగళూరు పోలీసులు హేమ రేవ్ పార్టీలో పట్టుబడిందని స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆమె తన ఇంట్లో బిర్యానీ చేస్తున్న వీడియోని రిలీజ్ చేసింది. కానీ నెటిజనులు ఎవరు హేమను నమ్మలేదు. కవరింగ్ చేసుకోవడం ఆపండి అంటూ ట్రోల్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఆమె బ్లడ్ టెస్ట్‌లో డ్రగ్స్ తీసుకున్నట్లు రావడంతో.. హేమ రేవ్ పార్టీకి వెళ్లడమే కాక డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు మరోసారి స్పష్టం అయ్యింది.