Hema: నటి హేమకి అనారోగ్యం! సడెన్‌గా ఏమి బాగలేకుండా వచ్చిందంటే?

Bangalore Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు వెలుగు చూసిన నాటి నుంచి నటి హేమ పేరు మీడియాలో మార్మొగుతుంది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. మరి ఇంత సడెన్‌గా హేమ ఆరోగ్యం ఎందుకు పాడయ్యిందంటే..

Bangalore Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు వెలుగు చూసిన నాటి నుంచి నటి హేమ పేరు మీడియాలో మార్మొగుతుంది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. మరి ఇంత సడెన్‌గా హేమ ఆరోగ్యం ఎందుకు పాడయ్యిందంటే..

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి ఏపీ, తెలంగాణ నుంచి పలువరు సినీ, వ్యాపార, రాజకీయ సెలబ్రిటీలు హాజరైనట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ పార్టీలో టాలీవుడ్‌ సీనియర్‌ నటి హేమ కూడా ఉండటం సంచలనం రేపింది. రేవ్‌ పార్టీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. సదరు రిసార్ట్‌ మీద దాడి చేసి.. పార్టీకి హాజరైన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ సీనియర్‌ నటి హేమ రేవ్‌ పార్టీలో పట్టుబడిన సంగతి తెలిసిందే. కానీ తాను రేవ్‌ పార్టీలో లేనని కప్పి పుచ్చుకోవడం కోసం హేమ రకరకాల ప్రయత్నాలు చేసి.. అభాసు పాలయ్యింది. స్వయంగా బెంగళూరు పోలీసులు హేమ రేవ్‌ పార్టీకి హాజరైనట్లు వెల్లడించారు. ఇక ఆమె బ్లడ్‌లో డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆ వివరాలు..

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకి హాజరుకావాలని నటి హేమకి పోలీసులు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరు పోలీసుల విచారణకు హేమ డుమ్మా కొట్టారు. ఈరోజు (మే 27) తాను విచారణకు హాజరుకాలేనంటూ హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. అనారోగ్య సమస్యల వల్ల తాను మే 27, సోమవారం నాటి విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని.. విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు. అయితే హేమ లేఖను పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా మరో నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

గత ఆదివారం అనగా మే 19న బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌ హౌస్‌లో ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో ఓ రేవ్‌ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో దాదాపుగా 150 మందికి పైగా పాల్గొన్నారు. దీని గురించి సమాచారం అందడంతో.. పోలీసులు ఫామ్‌ హౌస్‌పై దాడి చేసి.. రేవ్‌ పార్టీలోపాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ డ్రగ్స్‌ కూడా లభ్యం అయ్యాయి. పార్టీలో పాల్గొన్న వారిలో 103 మంది బ్లడ్ శాంపిల్స్‌ను బెంగళూరు నార్కోటిక్ టీమ్ సేకరించింది.

103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్స్‌లో తేలింది. ఇందులో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిరూపణ అయ్యింది. దీంతో హేమతో పాటు రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన వారందరికీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. తాజాగా ఈ కేసు విచారణకే హేమ డుమ్మా కొట్టారు. ఇక రేవ్‌ పార్టీ వివాదంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు.. నటి హేమకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.

Show comments