‘బేబీ’ కలెక్షన్స్! మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే?

  • Author ajaykrishna Updated - 12:51 PM, Sat - 15 July 23
  • Author ajaykrishna Updated - 12:51 PM, Sat - 15 July 23
‘బేబీ’ కలెక్షన్స్! మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే?

మంచి బజ్ క్రియేట్ చేసుకోవాలి గాని చిన్న సినిమాలు మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంటాయి. అందులోనూ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఆ సినిమా కలెక్షన్స్ ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే.. ఈరోజుల్లో ఎంత పెద్ద సినిమా అనేది మ్యాటర్ కాదంటున్నారు ఆడియన్స్. కంటెంట్ ముఖ్యం అని ఇప్పటికి చాలాసార్లు ప్రూవ్ చేస్తూ వచ్చారు. వాళ్లకు కావాల్సిన విధంగా ఫ్రెష్ కంటెంట్ తో వస్తే.. ఖచ్చితంగా బొమ్మ హిట్టు చేసి చేతిలో లాభాలు పెడతారు. ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ చేసుకొని చిన్న సినిమాగా రిలీజైన ‘బేబీ’ సినిమా విషయంలో అదే జరుగుతుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన కొత్త సినిమా బేబీ.

ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమాని దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించగా.. నిర్మాత ఎస్కేఎన్ ప్రొడ్యూస్ చేశారు. ఇక సాంగ్స్, టీజర్, ట్రైలర్ లతో ముందు నుండి ప్రేక్షకులలో అంచనాలు క్రియేట్ చేసిన బేబీ మూవీ.. జులై 14న థియేటర్స్ లో విడుదలైంది. అయితే.. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ఫస్ట్ డే ఊహించని విధంగా భారీ ఓపెనింగ్స్ వచ్చాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో బేబీ ఫీవర్ బాగా ఎక్కింది. ఎలాగో విడుదలైన అన్ని చోట్లా మూవీకి పాజిటివ్ టాక్ లభించడం మరో ప్లస్. అయితే.. సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ బట్టి.. ఓపెనింగ్స్ పై ఓ నెంబర్ ఎక్స్ పెక్ట్ చేశారట మేకర్స్. కానీ.. సినిమా ఊహించని విధంగా ఎక్స్ పెక్ట్ చేసినదానికి ఎక్కువ తీసుకొచ్చిందని అంటున్నారు. మరి బేబీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఏరియా వైస్ ఇప్పుడు చూద్దాం!

బేబీ ఫస్ట్ డే కలెక్షన్స్:.

  • నైజాం: 1.20 కోట్లు
  • సీడెడ్: 31 లక్షలు
  • ఉత్తరాంద్ర: 42 లక్షలు
  • ఈస్ట్: 18 లక్షలు
  • వెస్ట్: 11 లక్షలు
  • గుంటూరు: 15 లక్షలు
  • కృష్ణ: 15 లక్షలు
  • నెల్లూరు: 8 లక్షలు

AP-TG:- 2.60 కోట్లు షేర్ (4.65 కోట్లు గ్రాస్)

  • కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: 10 లక్షలు
  • ఓవర్సీస్: 78 లక్షలు

వరల్డ్ వైడ్: 3.48 కోట్లు షేర్ (6.55 కోట్లు గ్రాస్)

బేబీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు చూస్తే.. వరల్డ్ వైడ్ రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక మొదటి రోజే రూ. 3.48 కోట్లు షేర్ వసూల్ చేసింది. కాబట్టి.. ఇంకా రూ. 4.52 కోట్లు షేర్ రాబడితే సినిమా క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిపోతుంది. ఆల్రెడీ రెండో రోజు కూడా సినిమాకు బుకింగ్స్ గట్టిగానే కవర్ అయినట్టు తెలుస్తుంది. అదిగాక వీకెండ్ కాబట్టి.. శని, ఆదివారాలు కలెక్షన్స్ గట్టిగా రాబట్టే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ మాత్రమే కాదు.. సినిమా మొదటి మూడు రోజుల్లో లాభాలు తెచ్చినా ఆశ్చర్యపోయే అవసరం లేదని చెప్పుకోవాలి. మరి బేబీ మూవీ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.

Show comments