Annapurna Studios: సినిమాలో ఆఫర్ అంటూ అన్నపూర్ణ స్టూడియో పేరుతో ఫేక్ మెయిల్స్

Annapurna Studios: సినిమాల్లో నటించాలి, మెగాస్టార్ చిరంజీవిలానో లేక హాస్య బ్రహ్మా బ్రహ్మానందంలా అయిపోదామనుకుని చాలా మంది ఊర్ల నుండి హైదరాబాద్ నగరానికి వచ్చేస్తుంటారు. వీరిని టార్గెట్ చేస్తున్నారు మోసగాళ్లు. తాజాగా

Annapurna Studios: సినిమాల్లో నటించాలి, మెగాస్టార్ చిరంజీవిలానో లేక హాస్య బ్రహ్మా బ్రహ్మానందంలా అయిపోదామనుకుని చాలా మంది ఊర్ల నుండి హైదరాబాద్ నగరానికి వచ్చేస్తుంటారు. వీరిని టార్గెట్ చేస్తున్నారు మోసగాళ్లు. తాజాగా

సినిమా అంటే ఎంటర్‌టైన్ మెంటే కాదు ఎమోషన్ కూడా. సినిమా మీద పిచ్చి, ఫ్యాషన్‌తో చాలా మంది ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్‌కు వెళ్లే రైలెక్కేస్తుంటారు. వెండితెరపై తమను తాము చూసుకోవాలని ఆరాటపడుతూ ఎక్కడకు వెళ్లాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక కష్టాలు పడుతుంటారు. స్టూడియో గేట్ల దగ్గర లేదంటే సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుంటారు. ఇలాంటి వారినే టార్గెట్ చేస్తూ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపుతున్నారు. నటీనటులు కావాలంటే కాస్టింగ్ కాల్ అంటూ ప్రకటనలు చేసి.. వారి వద్ద నుండి డబ్బులు దండుకుని పత్తా లేకుండా పోతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఫేక్ మెయిల్స్ పంపుతున్నారు. అలాగే ఫేక్ ప్రకటనలు చేస్తున్నారు. ఈ విషయం అన్నపూర్ణ స్టూడియో దృష్టికి వెళ్లింది.

కాస్టింగ్ కాల్ పేరుతో ప్రకటనలు, మెయిల్స్ పంపడంపై అన్నపూర్ణ స్టూడియో స్ స్పందించింది. అవి ఫేక్ మెయిల్ అండ్ ప్రకటన అని తెలిపింది. ఇంతకు ఆ ప్రకటనలో ఏముందంటే..? 205 ఖైదీ స్టోరీ అనే మూవీకి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన చేసింది. ఇందులో హీరో క్యారెక్టర్ 20-27 ఏళ్లు ఉండాలని, హీరోయిన్స్ ముగ్గురు అని అందులో 8-15 సంవత్సరాలు  ఉండాలని, ఫ్రెండ్ క్యారెక్టర్ (బాయ్స్ అండ్ గర్ల్స్) 8-15 సంవత్సరాలు వయసున్న వాళ్లు, అలాగే సిస్టర్ క్యారెక్టర్, చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇదే వయస్సుతో ఉన్నవాళ్లు కావాలంటూ ఎనౌన్స్ చేసింది. దీనిపై అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోగో వేసి ఉండటంతో పాటు ప్రొఫైల్ పిక్ పంపాలంటూ అడ్రస్ ఉండటంతో నిజమేనని అనుకున్నారంతా. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్పందించింది అన్నపూర్ణ స్టూడియోస్.

ఈ ప్రకటన సదరు నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో స్పందించింది. ‘అన్నపూర్ణ స్టూడియో పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ కాస్టింగ్ కాల్ మా దృష్టికి వచ్చింది. మేము ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మా సంస్థకు ఈ ప్రకటనకు ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తిగత సమాచారాన్ని అందించకండి. ఎలాంటి డబ్బులు పంపకండి. అలాంటి నకిలీ కాస్టింగ్ కాల్‌లో పాల్గొనకండి. మా కాస్టింగ్ కాల్, అప్ డేట్స్ కేవలం మా సోషల్ మీడియా ఖాతాలు, పేజీలల్లో మాత్రమే పోస్టింగ్ చేయబడతాయి’ అని పేర్కొంది. అయితే గతంలో కూడా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఇలాంటి ఫేక్ మెయిల్స్ పంపించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ వెల్లడించింది. మొన్నటి మొన్న మంచు విష్ణు నుండి కూడా కొంత మందికి ఫేక్ మెయిల్స్ వెళ్లిన సంగతి విదితమే.

Show comments