యానిమల్ హీట్.. సలార్ సైలెంట్! ఇది మంచి నిర్ణయమే!

సలార్‌ కారణంగా కొన్ని సినిమాలు పోస్ట్‌ అవుతున్నాయి. అలాంటి సలార్‌.. యానిమల్‌ కారణంగా వెనకడుగు వేస్తోంది. ఆ విషయంలో కొంత ఆలోచనల్లో పడిపోయింది...

సలార్‌ కారణంగా కొన్ని సినిమాలు పోస్ట్‌ అవుతున్నాయి. అలాంటి సలార్‌.. యానిమల్‌ కారణంగా వెనకడుగు వేస్తోంది. ఆ విషయంలో కొంత ఆలోచనల్లో పడిపోయింది...

యానిమల్‌, యానిమల్‌, యానిమల్‌.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా జపం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న సగటు సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో సందడి చేయనుంది. అయితే, అదే రోజు ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘సలార్‌’ ట్రైలర్‌ విడుదల కానుంది. చాలా రోజుల క్రితమే ట్రైలర్‌ లాంచ్‌కు సంబంధించిన డేట్‌ ఫిక్స్‌ అయింది.

సలార్‌ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యాన్స్‌తో పాటు సినిమా అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా సలార్‌ రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అంతకంటే ముందు ట్రైలర్‌ కోసం ఎదురు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉన్న సినిమా కావటంతో డిసెంబర్‌ 1వ తేదీ సాయంత్రం ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్మాణ సంస్థ ‘హోంబళే ఫిల్మ్స్‌’ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఉంటుందా? లేదా? అన్నదానిపై క్లారిటీ లేదు.

యానిమల్‌ హవా నడుస్తున్న ఈ నేపథ్యంలో.. సలార్‌ టీం ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. యానిమల్‌ సినిమా హీట్‌ తగ్గిన తర్వాత వరుస ప్రమోషన్లు చేయాలని సలార్‌ టీం భావిస్తోందట. ప్రీ రిలీజ్‌ ఈవెంట్లను దేశంలోని ముఖ్య నగరాల్లో నిర్వహించాలని చూస్తోందట. ఇక, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, సంగీత దర్శకుడు రవి బస్రూర్‌.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో రవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

కేజీఎఫ్‌ సినిమాలను మించి సలార్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఉండాలని ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నారట. దగ్గరుండి మరీ ట్యూన్స్‌ను ఓకే చేస్తున్నారట. ప్రింట్‌ బయటకు పంపే సమయానికి అంతా పగడ్బందీగా ఉండేలా చూస్తున్నారట. అంతేకాదు! ట్రైలర్‌ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. సినిమా పై ఉన్న అంచనాలు .. ట్రైలర్‌తో పది రెట్లు పెంచేయాలని భావిస్తున్నారట. ఇలా చేయటం వల్ల పెద్దగా ప్రమోషన్లు చేయాల్సిన అవసరం రాదని అనుకుంటున్నారట.

ఏది ఏమైనా ట్రైలర్‌ ఎలా ఉన్నా.. సలార్‌ విషయంలో మాత్రం కలెక్షన్ల సునామీ ఖాయం అని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. సలార్‌ సినిమాను దృష్టిలో పెట్టుకుని కొంత మంది స్టార్‌ హీరోలు తమ సినిమాలను పోస్టు పోన్‌ చేసుకుంటున్నారు. అలాంటి సలార్‌, యానిమల్‌ విషయంలో కొంత వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇది మంచి నిర్ణయమే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి, సలార్‌ టీం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments