బ్రేకింగ్: ప్రముఖ టీవీ యాంకర్ అరెస్ట్! చెత్త పని చేస్తూ చిక్కింది!

ప్రముఖ టీవీ యాంకరమ్మను పోలీసులు అరెస్టు చేశారు. తెరపై తన మాటలతో మెస్మరైజ్ చేసే వ్యాఖ్య దందా చేసి తనే వార్తల్లో నిలిచింది. ఆమెను కేరళలో పట్టుకున్నారు పోలీసులు.

ప్రముఖ టీవీ యాంకరమ్మను పోలీసులు అరెస్టు చేశారు. తెరపై తన మాటలతో మెస్మరైజ్ చేసే వ్యాఖ్య దందా చేసి తనే వార్తల్లో నిలిచింది. ఆమెను కేరళలో పట్టుకున్నారు పోలీసులు.

ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. తన ప్రియురాలు పవిత్రగౌడకు అసభ్యకర సందేశాలు పంపాడన్న ఆరోపణలపై రేణుకా స్వామిని కన్నడ నటుడు దర్శన్ హత్య చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత మరో కన్నడ నటుడు యువ రాజ్ విడాకుల వివాదం నడిచింది. ఇప్పుడు ఓ టీవీ యాంకర్ అరెస్టు అయ్యింది. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై కన్నడ న్యూస్ ఛానెల్ యాంకర్ దివ్య వసంతను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గుర్ని అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు. రాజ్ న్యూస్ సీఈవో వెంకటేశ్ అని చెప్పుకుంటున్న వ్యక్తితో పాటు.. దివ్య వసంత, సోదరుడు సందేశ్ వసంతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

జీవన్ భీమా నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఇందిరా నగర్‌లో ఉన్న ట్రీ స్పా అండ్ బ్యూటీ పార్లర్ ను స్రింగ్ ఆపరేషన్ చేపట్టారు వెంకటేష్ అతడి బృందం. ఓ మహిళతో పాటు సందేశ్ వసంత కస్టమర్ వేషంలో స్పాను సందర్శించి మసాజ్ ఎంచుకున్నారు. అంతలో స్పాలో వ్యభిచార రాకెట్‌ను నడుపుతున్నట్లు వీడియో సృష్టించాడు. ఈ వీడియోను రాజ్ న్యూస్ సీఈవో చెప్పుకుంటున్న వెంకటేశ్‌కు అందించగా.. స్పా సెంటర్ యజమాని శివకుమార్‌ను బెదిరించడం మొదలు పెట్టారు. డబ్బులు ఇవ్వకపోతే టెలికాస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. రూ. 15 లక్షలు ఇవ్వాలని, తక్షణమే రూ. 8 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. డబ్బులు దివ్యకు ఇవ్వాలని చెప్పాడు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు స్పా యజమాని శివ కుమార్. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటేశ్, సందేశ్‌లను అరెస్టు చేయగా.. యాంకర్ దివ్య పరారైంది. తమిళనాడు, కేరళ సహా పలు ప్రాంతాల్లో తలదాచుకున్న దివ్య వసంతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్, ఇతర నిందితులు డబ్బు వసూలు చేసే మార్గాల గురించి చర్చించేందుకు ‘స్పై రీసెర్చ్ టీమ్’ అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. గతంలో ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్లో పనిచేసిన దివ్య వసంత.. ఆరు నెలల క్రితమే ఈ బృందంలో చేరింది. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, రాజ్ న్యూస్ ఛానెల్ నిర్వహించే శివశ్రీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, రాజ్ న్యూస్‌తో వెంకటేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.‘వెంకటేష్ మా సంస్థ మార్కెటింగ్ టీమ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన కంపెనీ సీఈవో కాదు. సీఈవోగా చెప్పుకున్నందుకు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది.

Show comments