ఈ నటిని గుర్తుపట్టారా..? తెలుగులో క్లిక్ కాలేదు కానీ, ఆ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ యాక్ట్రెస్

ఆనందం మూవీలో తనూరాయ్ ఫ్రెండ్ గా నటించిన యాక్టర్ గుర్తుందా..? తెలుగు నటైనా ఆమెకు తెలుగులో గుర్తింపు రాలేదు. దీంతో ఆమె పొరుగు ఇండస్ట్రీకి వెళ్లి స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఆనందం మూవీలో తనూరాయ్ ఫ్రెండ్ గా నటించిన యాక్టర్ గుర్తుందా..? తెలుగు నటైనా ఆమెకు తెలుగులో గుర్తింపు రాలేదు. దీంతో ఆమె పొరుగు ఇండస్ట్రీకి వెళ్లి స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో అంత గుర్తింపు ఉండదన్న అపవాదు ఉంది. ఈ వ్యాఖ్యలు నిజం అని నిరూపించేలా కొంత మంది అమ్మాయిలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పేరు తెచ్చుకుంటున్నారు. అంజలి నుండి ఇప్పటి శ్రీ గౌరి ప్రియ వరకు ఎంతో మంది ముద్దుగుమ్మలు ఈ కోవలోకే వస్తారు. వారిలో ఒకరు సునీతా వర్మ. ఇప్పటి జనరేషన్‌కు ఆమె ఎవరో తెలిసి ఉండకపోవచ్చును కానీ.. 2000వ దశకంలో చిన్న సినిమాల హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఆమెకు గుర్తింపు నిచ్చిన పాత్రలు అంటే హరికృష్ణ హీరోగా వచ్చిన సీతయ్య, ఆనందం చిత్రాలు, ఇక్కడ తగినంత గుర్తింపు రాకపోవడంతో ఆమె తమిళ్, మలయాళ ఇండస్ట్రీల్లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు ఆమె ఎంతలా మారిపోయిందంటే..?

సునీతా వర్మ స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి. ఆమె పూర్తి పేరు సునీతా వర్మ అల్లూరి. విశాఖ పట్నంలో పుట్టిన సునీతా.. 2001లో నీవంటే నేనుంటా చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సీరియల్లో అలరిస్తున్న సాయి కిరణ్ హీరో. ఫ్యాన్స్, ఉత్సవం అనే మూవీల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్‌కు పరిమితమైంది. ఆనందం మూవీలో తనూరాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో మెప్పించింది. సీతయ్యలో ఓ కీ రోల్ చేసింది. ఆమెను లవర్ ద్రోహం చేస్తే.. అతడికి బుద్ధి చెబుతాడు హరికృష్ణ. చిన్నపాత్రే అయినా గుర్తిండిపోతుంది. ఒట్టేసి చెబుతున్నా, నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రాల్లో కూడా యాక్ట్ చేసింది. కానీ ఆమెకు తెలుగులో సరైన గుర్తింపు రాలేదని చెప్పొచ్చు. తమిళంలో రూట్ మార్చి గ్లామరస్ పాత్రల్లో నటించడం స్టార్ట్ చేసింది. అక్కడ పేరు మార్చుకుంది. జన ప్రియ అనే పేరుతో ఎంట్రీ ఇచ్చింది.

ఒరు మురాయి సొల్లువీడు చిత్రంతో కెరీర్‌లో డ్రాస్టిక్ ఛేంజస్ మొదలయ్యాయి. ఆ తర్వాత సత్య రాజ్‌తో 6.2 చిత్రంలో నటించింది. ఇరువరం మట్టుమ్, పిరాగు వంటి చిత్రాల్లో నటించింది. అటు కన్నడలో శివరాజ్ కుమార్ సరసన అశోకా అనే చిత్రంలో నటించింది. అటు మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ రాధా వర్మగా పేరు మార్చుకుంది. క్రేజీ గోపాలన్, డా పేషెంట్, అగైన్ కాసర్ గఢ్ కేదర్ భాయ్, సీనియర్స్ వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇటు తమిళ్, మలయాళంలో స్టార్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ స్థిరపడింది. తెలుగులో 2004 తర్వాత ఆమె నటించలేదు. 2016లో మలయాళంలో చివరిగా ఓ మూవీ చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది. ఇప్పటికీ అదే అందంతో మెస్మరైజ్ చేస్తుంది ఈ తెలుగమ్మాయి.

Show comments