అభిమాని చేసిన పనికి ఎమోషనల్‌ అయిన తమన్నా.. వీడియో వైరల్‌!

తల్లిప్రేమ చాలా గొప్పది అంటారు. ఎందుకంటే.. అమ్మ మన నుంచి ఏం ఆశించకుండా.. ప్రేమను, ఆప్యాయతను పంచుతుంది. అలానే అభిమానులు కూడా తమ ఫేవరెట్‌ హీరో,హీరోయిన్లు, ఆటగాళ్ల మీద.. స్వచ్ఛమైన ప్రేమను, ఎలాంటి కల్మషం లేని అభిమానాన్ని చూపుతారు. జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన తారలను కలుస్తారో లేదో తెలియకపోయినా.. వారి మీద ఎనలేని అభిమానాన్ని చూపుతారు. ఇక కొందరు స్టార్స్‌కయితే ఏకంగా గుళ్లు కట్టి.. విగ్రహాలు ప్రతిష్టించి.. తమ ప్రేమను చాటుకుంటారు. ఇక అభిమాన తారలు కనిపించిన వేళ.. వారి కళ్లల్లో కనిపించే సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం. మరి కొందరు అభిమాన తారలను కలవడం కోసం దూరాభారం లెక్కచేయక.. ఎన్నో వ్యయప్రయసాల కోర్చి.. ప్రయాణం చేసి వారిని కలుసుకుంటారు. ఇక తాజాగా ఓ అభిమాని చేసిన పనికి హీరోయిన్‌ తమన్నా తీవ్ర భావోద్వాగానికి గురయ్యింది. ఇంతకు ఆమె ఏం జరిగింది అంటే…

హ్యాపీడేస్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది తమన్నా.. ఆతర్వాత వరుస సినిమాలలో నటిస్తూ.. సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. బాహుబలి సినిమాతో… పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌, హిందీ ఇలా భాషా చిత్రాల్లో నటిస్తూ.. ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడు జీ కర్దా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే త్వరలోనే లస్ట్ స్టోరీ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఇక రెండు సిరీస్‌లలో తమన్నా కెరీర్‌లోనే తొలిసారి రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది తమన్నా. సినిమాలపరంగానే కాక.. ఇక పర్సనల్‌ లైఫ్‌లో లవ్‌లో పడింది తమన్నా. విజయ్‌ వర్మతో లవ్‌లో ఉంది ఈ భామ. ప్రస్తుతం కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌ రెండింటిని బ్యాలెన్స్‌ చేస్తూ.. దూసుకుపోతుంది.

ఇక తమన్నాకు సౌత్‌, బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. బీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అమ్ముడు సొంతం. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని చేసిన పనికి తమన్నా ఎమోషనల్ అయ్యింది. కన్నీరు పెట్టుకుంది. ఏం జరిగింది అంటే.. తాజాగా ముంబై విమానాశ్రయంలో తమన్నా ఓ అభిమానిని కలిసింది. తమన్నాను కలిసిన ఆ వ్యక్తి వెంటనే ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. ఓ బొకే ఇచ్చి తన చేతి పై ఉన్న తమన్నా పచ్చబొట్టును చూపించాడు. దాంతో తమన్నా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. వెంటనే అతడిని కౌగిలించుకొని ఐ లవ్ యు చెప్పింది. ఈ వీడియో పై తమన్నా అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Show comments