ప్రభాస్, మహేష్ ల తర్వాత బన్నీకే ఆ గౌరవం!

  • Author ajaykrishna Published - 01:04 PM, Tue - 19 September 23
  • Author ajaykrishna Published - 01:04 PM, Tue - 19 September 23
ప్రభాస్, మహేష్ ల తర్వాత బన్నీకే ఆ గౌరవం!

ఇండస్ట్రీలో క్రేజ్ అనేది హీరోలను ప్రపంచస్థాయిలో నిలబెడుతుంది. ఎక్కడి ఇండస్ట్రీ అక్కడికే పరిమితం అయ్యుంటే పాన్ ఇండియా అనే పదం ఇంతలా బయటికి వచ్చేది కాదేమో! కానీ.. ఎప్పుడైతే బాహుబలితో రాజమౌళి ఆ హద్దులన్నీ చెరిపేశాదో.. అప్పటినుండి పాన్ ఇండియా అనేది బాగా వాడుకలోకి వచ్చిందని చెప్పాలి. దీంతో ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం రాజమౌళి చూపిన బాటలో అడుగులు వేస్తోంది. కంటెంట్ కరెక్ట్ అనిపిస్తే.. హీరో ఎవరైనా పాన్ ఇండియా రిలీజ్ చేసేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ తర్వాత తెలుగు నుండి పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

ఇక పుష్ప సినిమాకి గాను బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ ఫ్యాన్స్ తో పాటు పుష్పరాజ్ యాటిట్యూడ్ కి విదేశీయులు సైతం ఫిదా అయిపోయారు. కాగా.. పుష్ప క్యారెక్టర్ కి గాను బన్నీ ఇప్పటిదాకా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. రీసెంట్ గా బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. దీంతో మరోసారి బన్నీ పేరు వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యింది. అయితే.. ఇప్పుడు బన్నీ.. ప్రభాస్, మహేష్ బాబుల బాటలో చేరినట్లు తెలుస్తుంది. అదేంటంటే.. బాలీవుడ్ లో అమితాబ్, షారుఖ్, షాహిద్ లాంటి స్టార్స్ కి లండన్ లోని మ్యాడ‌మ్ టుస్సాడ్స్ లో మైన‌పు విగ్ర‌హాలు(వాక్స్ స్టేట్యూ)వెల‌సిన సంగ‌తి తెలిసిందే.

ఈ అరుదైన గౌరవం టాలీవుడ్ నుండి డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబులకు దక్కింది. వారి విగ్రహాలు ఆల్రెడీ మ్యాడ‌మ్ టుస్సాడ్స్ లో ఆవిష్క‌రించడం జరిగింది. ఇప్పుడీ గౌరవం బన్నీకి దక్కుతున్నట్లు సమాచారం. నేషనల్ అవార్డు విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించే పనులు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఉన్న బన్నీ.. రెండు రోజుల్లో లండన్ కు బయలుదేరతాడని అంటున్నారు. అక్కడ బన్నీ తన విగ్రహం కోసం కొలతలు ఇచ్చి, ఫార్మల్టీస్ పూర్తి చేసి వస్తాడని సమాచారం. వచ్చే ఏడాది ఆ విగ్రహం ఆవిష్కరణ జరుగుతుందట. ఈ లెక్కన బన్నీకి కూడా అరుదైన గౌరవం దక్కుతుండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show comments