సింగిల్ సినిమా వసూళ్లలో కొంత భాగం మన సైనికులకు: అల్లు అరవింద్

ప్రస్తుతం దేశ సరిహద్దులో వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏ క్షణాన ఏమౌతుందా అని ప్రపంచ ప్రజలందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్బంగా అల్లు అరవింద్ కూడా దేశ సైనికులకు తన మద్దతును తెలియజేసారు. దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం దేశ సరిహద్దులో వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏ క్షణాన ఏమౌతుందా అని ప్రపంచ ప్రజలందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్బంగా అల్లు అరవింద్ కూడా దేశ సైనికులకు తన మద్దతును తెలియజేసారు. దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇలా ఉన్నాయి.

దేశ సరిహద్దుల్లో ఓ వైపు ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రజలు తెలుసుకుంటూనే ఉన్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది భారత దేశ సైనికులకు తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఏ క్షణాన ఏమౌతుందా అని దేశ ప్రజలంతా కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు థియేటర్ లో సందడి చేయాల్సిన సినిమాలు చేస్తూనే ఉన్నాయి. ఈ శుక్రవారం రెండు సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయ్యాయి. వాటిలో  శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూవీ ఒకటి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.

శ్రీ విష్ణు కామెడీ టైమింగ్.. వన్ లైన్ పంచ్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. శ్రీ విష్ణు ఖాతాలో మరో హిట్ ఖాయం అంటున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో మూవీ టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా నిర్మాత అల్లు అరవింద్ . మన భారత దేశ సైనికుల గురించి , అక్కడ జరుగుతున్న వార్ గురించి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అదేంటంటే సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని మన దేశ సైనికులకు అందిస్తాం అని అల్లు అరవింద్ ప్రకటించారు. అంటే ఈ సినిమా నుంచి వచ్చే లాభాలలో కొంత మన దేశ సైనికులు , వారి కుటుంబాల కోసం ఉపయోగించనున్నారు. ఇది సైనికుల పట్ల గౌరవం , మన మద్దతు తెలియజేయడానికి ఓ మంచి అవకాశం అని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితుల్లో మన దేశ సైనికులకు అండగా ఉండడం అనేది చాలా మంచి నిర్ణయం అని చెప్పి తీరాల్సిందే. అలాగే అల్లు అరవింద్ తో పాటు.. పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ మద్దతును తెలుపుతున్నారు.

ప్రస్తుతానికి దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో భారత ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. కానీ సోషల్ మీడియాలో అనేక ఫేక్ వీడియోలు కూడా దర్శనమిస్తున్నాయి. కాబట్టి ప్రజలంతా అపప్రమత్తంగా ఉండాలని కూడా పలువురు సూచిస్తున్నారు. అలాగే యావత్ భారతీయులు అంతా కూడా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలుపుతున్నారు. మరి అల్లు అరవింద్ సింగల్ మూవీ వసూళ్ళలో కొంత భాగాన్ని.. భారత సైనికులకు అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments