Nagendra Kumar
Allari Naresh: కామెడీ ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ తన పేరుకు ముందు ఉండే బిరుదు గురించి, ఆయన సినిమాల పై తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Allari Naresh: కామెడీ ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ తన పేరుకు ముందు ఉండే బిరుదు గురించి, ఆయన సినిమాల పై తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Nagendra Kumar
నాంది, ఉగ్రం లాంటి సినిమాలను చేస్తున్నా, నరేష్ పేరుకి ముందు అల్లరి అనే ట్యాగ్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ మధ్యనే వచ్చిన నా సామి రంగా సినిమాలో కూడా చాలా ఎమోషనల్ పాత్రతో సినిమాకి ఎంతో సపోర్ట్ అయినా సరే, చివరికి ఆ పాత్ర సినిమాలో మరణించినా సరే…ఏది ఏమైనా నరేష్ మాత్రం ఆ అల్లరి అనే బిరుదును మాత్రం వెంటనే కేరీ చేస్తున్నాడు. ఈ అల్లరి అనే మాట చేస్తున్న అల్లరి గురించి నరేష్ నిన్నే జరిగిన ఆ ఒక్కటి అడక్కు టీజర్ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడాడు.
‘’నా ఫస్ట్ సినిమా పేరే ఇప్పటికీ నాతో కేరీ ఫార్వర్డ్ కావడం నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. అలాగని నేను ఎవ్వరినీ నా పేరు ముందు అల్లరి అని పెట్టమని ఫోర్స్ చేయను. ప్రోద్బలం కూడా ఉండదు. వాళ్ళు అల్లరి నరేష్ అని పెట్టుకున్నా, ఒక్క నరేష్ అని మాత్రమే పెట్టుకున్నా అది ఆ సినిమా దర్శకుడి ఛాయిస్ కే వదిలేస్తుంటాను. నాకు 90 ఏళ్ళు వచ్చినా నేను అప్పటికీ ఇంకా అల్లరి నరేష్ గానే ఉంటాను. కామెడీ సినిమాల గురించి చెప్పాలంటే ఈ మధ్య రోజుల్లో నేను చాలా కథలు విన్నాను. కానీ స్పూఫ్లు, డబుల్ మీనింగ్ డైలాగులు…ఇలాటివైతే చెయ్యడానికి ఇష్టం లేదు. మా నాన్నగారు ఒక్కటే చెప్పారు నాకు. కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమా అంటే కుటుంబం మొత్తం వస్తారు. ఒక్క ఫ్యామిలీ నుంచి నాలుగు టిక్కెట్లు తెగుతాయి. వాళ్ళందరూ కలసి హాయిగా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి గానీ, ఏ కారణానికి ఇబ్బంది పడకూడదు అని నన్ను హెచ్చరించారు. ఎన్ని సినిమాలు కామెడీ సినిమాలు చేసినా సరే ఆయన చెప్పిన మాటని మనసులో పెట్టుకునే చేశాను. ఆ ఒక్కటి అడక్కు సినిమా కంప్లీట్ గా సిట్యువేషనల్ కామెడీ. ఏదీ ఫోర్సుడుగా ఉండదు. తెచ్చిపెట్టుకున్న ఏ సీను ఉండదు. కేవలం నవ్వించడానికి ఏదీ ఏ సీనూ ఇరికించలేదు.’’ అని చెఫ్పాడు.
ఆ ఒక్కటి అడక్కు టైటిల్ గురించి చెబుతూ ‘’ మా ఫాదర్ డైరెక్ట్ చేసిన మొదటి ఆ ఒక్కటీ అడక్కు హిట్ అయింది కాబట్టి, అ టైటిల్ని పెట్టుకోలేదు. ఈ కథకి పర్ఫెక్టుగా సెట్ అవుతుంది. మా ఫాదర్ డైరెక్ట్ చేసిన సినిమాలో హీరో జీవితంలో సెటిల్ కాకుండా పెళ్ళి చేసుకోవడానికి తాపత్రయపడితే, మా సినిమాలో హీరో జీవితంలో స్థిరపడ్డాక కూడా పెళ్ళి కాదు. కానీ కంటెంటె గా చెప్పాలంటే హిలేరియస్ కామెడీ, ఫామిలీ అంతా హాయిగా నవ్వుకునే హెల్దీ కామెడీ ఉంటుంది సినిమాలో. దీనిమీద చాలావరకూ చర్చించుకున్నాం. ఆ టైటిల్ పెట్టడం కరెక్టా కాదా అని. కొన్నాళ్ళ పాటు డిస్కస్ చేసుకున్నాకే అందరం ఇది కరెక్టే అనే నిర్ణయంతోనే ఫైనలైజ్ చేశాం. పైగా నాకు హక్కు, అర్హతా కూడా ఉన్నాయి. మా ఫాదర్ సినిమా టైటిలే పెట్టుకున్నాను. ఆయన పేరుని, కీర్తిని హండ్రెడ్ పర్సంట్ పాడు చేయదు ఈ సినిమా అని మాత్రం చెప్పగలను.’’ అని నవ్వుతూ చెప్పాడు అల్లరి నరేష్.