P Venkatesh
మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు వింటేనే జై ఎన్టీఆర్ అంటూ ఊగిపోతూ ఉంటారు. గత పదేళ్లుగా తారక్ కు వరుసగా అన్ని హిట్స్ ఏ.. ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే వారు ఎవరు లేరు. అదేంటో చూసేద్దాం.
మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు వింటేనే జై ఎన్టీఆర్ అంటూ ఊగిపోతూ ఉంటారు. గత పదేళ్లుగా తారక్ కు వరుసగా అన్ని హిట్స్ ఏ.. ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే వారు ఎవరు లేరు. అదేంటో చూసేద్దాం.
P Venkatesh
ఆ యాక్టింగ్ ఏంటన్నా ఇరగదీశావ్.. ఇండస్ట్రీలో నిన్ను కొట్టే హీరో లేడు… ఆరేళ్ళ ఆకలి ఒక్క దెబ్బతో తీర్చేశావ్.. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ప్రూవ్ చేశావ్.. డ్యాన్స్ అంటేనే ఎన్టీఆర్,ఎన్టీఆర్ అంటేనే డ్యాన్స్..తారక్ నట విశ్వరూపానికి పాత రికార్డులు బద్ధలవుతున్నాయి. ఇలాంటి రేర్ రికార్డ్స్ నీకు మాత్రమే సాధ్యం. ఇవన్నీ తారక్ డై హార్డ్ ఫ్యాన్స్ నుంచి విమర్శకులు వరకు ప్రతి ఒక్కరు చెప్తున్న మాటలు. ప్రస్తుతం దేవర థియేటర్స్ లో రఫ్ ఆడిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. వసూళ్ల సునామి సృష్టిస్తుంది. కాబట్టి దేవర మీద ఉన్న అభిమానంతోనే ఫ్యాన్స్ ఇలా అంటున్నారనుకుంటే పొరపాటే. గర్వంగా కాలర్ ఎగరేస్తూ.. ఇది తారక్ కే సాధ్యం అనే మాటలు కేవలం ఒక్క దేవర గురించే కాదు. దాదాపు పదేళ్ల నుంచి ఎలాంటి ప్లాప్ లేకుండా వరుస బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న అన్ని సినిమాల కోసం. నిజమే కదా మరీ ఇండస్ట్రీలో ఇలాంటి రేర్ ఫీట్ కేవలం ఒక్క ఎన్టీఆర్ కు మాత్రం సాధ్యం.
ఆ రేర్ ఫీట్ ఏంటా అనుకుంటున్నారా.. 2015కు ముందు ఎన్టీఆర్ సినిమాలంటే అందరికి గుర్తొచ్చేది స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి , యమదొంగ లాంటి హిట్ సినిమాలే. ఇక వాటిలో సింహాద్రి , ఆంధ్రావాలా లాంటి సినిమాలు ఫ్యాన్స్ కు కిక్కెకించాయి. ఆ తర్వాత తారక్ కూడా కాంబినేషన్ చూసుకుంటూ.. లేదా అప్పుడు మార్కెట్ లో ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారు అని ఆలోచించి .. కథలను ఎంచుకునే వాడు. దీనితో సింహాద్రి మూవీ తర్వాత మళ్ళీ టెంపర్ రిలీజ్ అయ్యే వరకు తారక్ ఖాతాలో అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. మధ్యలో యమదొంగ , అదుర్స్ , బాద్ షా లాంటి సినిమాలు హిట్ కొట్టినా కూడా.. తారక్ స్టాండర్డ్ ను అందుకోలేకపోయాయి. ఇక తారక్ ఎలాంటి సినిమాలను తీసినా.. అది బావున్నా లేకున్నా తారక్ కోసం ఫ్యాన్స్ హిట్ చేస్తూనే వచ్చారు. అలా దాదాపు పదేళ్ల పాటు తారక్ ప్లాప్స్ చూడక తప్పలేదు. కానీ ఇక ఆ తర్వాత తారక్ కథల ఎంపిక మారింది. తన అభిమానులు ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ ను ఇష్టపడుతున్నారో వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టాడు.
అలా 2015 లో టెంపర్ తో మొదలైన జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ రికార్డుల వేట.. దేవర ఆట మొదలయ్యాక కూడా ఆగలేదు. ఇక ఇప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ వసూళ్ల వేట ఆగే ప్రసక్తే లేదు. టెంపర్ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో , జనత గ్యారేజ్ , జై లవ కుశ , అరవింద సమేత , ఆర్ఆర్ఆర్ ఇక ఇప్పుడు దేవర. ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాడు తారక్. ఇప్పటివరకు ఇండస్ట్రీలో వరుస హిట్స్ ఇచ్చిన హీరో లేడు. పైగా రాజమౌళి విషయంలో తనతో మొదలైన ప్లాప్ సెంటిమెంట్ ను కూడా తారక్ ఏ బ్రేక్ చేశాడు. కాబట్టి ఈ రేర్ రికార్డ్ తారక్ కు మాత్రమే సొంతం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.