N Convention Rent: వామ్మో.. నాగార్జున N కన్వెన్షన్ రెంట్ రోజుకి అన్ని లక్షలా?

N Convention Rent Per Day: గత రెండు, మూడు రోజులుగా మీడియా సోషల్‌ మీడియాలో ఎన్‌ కన్వెన్షన్‌ పేరే మార్మోగిపోతుంది. ఈ క్రమంలో ఎన్‌ కన్వెన్షన్‌కు సంబంధించి ఆసక్తికర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..

N Convention Rent Per Day: గత రెండు, మూడు రోజులుగా మీడియా సోషల్‌ మీడియాలో ఎన్‌ కన్వెన్షన్‌ పేరే మార్మోగిపోతుంది. ఈ క్రమంలో ఎన్‌ కన్వెన్షన్‌కు సంబంధించి ఆసక్తికర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..

అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఇలాంటి కట్టడాల పని పట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ.. హైడ్రాని ఏర్పాటు చేశారు. ఇక మొదటి రోజు నుంచే హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం అనగా శనివారం నాడు.. హైడ్రా అధికారులు.. టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేయడం సంచలనంగా మారింది. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. తాను ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని.. అన్ని అనుమతులు తీసుకునే నిర్మాణం చేపట్టానని.. అయినా సరే అధికారులు ఎన్‌ కన్వెన్షన్‌ని కూల్చి వేశారని చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ అంశంపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గత మూడు రోజులుగా మీడియా, సోషల్‌ మీడియాలో ఎన్‌ కన్వెన్షన్‌కు సంబంధించిన వార్తలే వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఎన్‌ కన్వెన్షన్‌.. నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన మాదాపూర్‌లో ఉంది. ఇక్కడ వివాహ వేడుకలు, బర్త్ డే పార్టీలు, గెట్ టూ గెదర్ ఫంక్షన్లు, సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ల కోసం దీనిని బుక్ చేసుకుంటారు. ఎంతో ఖరీదైన ఏరియాలో ఉన్న  ఎన్‌ కన్వెన్షన్‌ రెంట్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది అంటున్నారు. ఒక్క రోజుకే లక్షల రూపాయల అద్దె వసూలు చేస్తారని తెలుస్తోంది. ఆ వివరాలు..

 

ఒకప్పుడు ఎంత చిన్న శుభకార్యమైనా సరే.. ఇంటి దగ్గరే నిర్వహించేవారు. ఏవైనా మొక్కులు ఉంటే.. ఆలయాల దగ్గర చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం అన్నప్రాశన మొదలు.. పెళ్లి వరకు ప్రతి చిన్నాపెద్దా శుభకార్యాలను.. ఫంక్షన్‌ హాళ్లలోనే నిర్వహిస్తున్నారు. వేడుకను బట్టి అవి అద్దెలు వసూలు చేస్తుంటాయి. అదే వివాహానికి అయితే రోజుకు 2-3 లక్షల వరకు రెంట్‌ వసూలు చేస్తారు. నార్మల్‌ ఫంక్షన్‌ హాళ్లలోనే ఈ రేంజ్‌లో అద్దెలు ఉంటే.. ఇక అత్యంత ఖరీదైన ప్రాంతంలో నెలకొల్పిన ఎన్ కన్వెన్షన్‌లో రెంట్లు ఇంక ఎంత భారీగా ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు. సామాన్యులేవరూ ఎన్‌ కన్వెన్షన్‌ రెంట్‌ని భరించలేరు. అంత భారీగా ఉంటాయట.

సిటీలో ఉన్న చాలా మంది బడా పారిశ్రామిక వేత్తలు, సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఎన్ కన్వెన్షన్‌లో వేడుకలు చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఎన్‌ కన్వెన్షన్‌ను ఆనుకుని సుందరమైన సరస్సు అతిథులను ఆకట్టుకుంటుంది. తమ్మిడికుంట చెరువుకు ఆనుకుని కట్టిన ప్రాంగణంకు వచ్చిన అతిథులకు ఆహ్లాదం కలుగజేస్తుంది. హైటెక్ సిటీ, శిల్పారామం పరిసర ప్రాంతాలు కావడంతో అడ్రెస్ కనుక్కోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందని భావిస్తుంటారు.

ఎన్‌ కన్వెన్షన్‌ ప్రత్యేకతలివే..

ఎన్‌ కన్వెన్షన్‌లో దాదాపు మూడు వేల మందికి పైగా కూర్చుని వేడుక చూసే సదుపాయం ఉంది. 27 వేల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో అత్యంత విశాలమైన ప్రాంగణం ఉంటుంది. ఇక్కడ అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లు కూడా జరుగుతుంటాయి. ఇక చుట్టుపక్కల ఐటీ కంనెనీలకు సంబంధించి ఫారిన్ డెలిగేట్ల సమావేశాలు, వార్షిక సంవత్సర వేడుకలను కూడా ఇక్కడ నిర్వహిస్తారు. సుమారు 14 ఏళ్ల క్రితం ఎన్ కన్వెన్షన్‌ను ఆరంభించారు. ఇక దీని అద్దె విషయానికి వస్తే.. రోజుకు రెంట్‌ 5 లక్షల రూపాయల నుంచి మొదలవుతుందని అంటున్నారు. ఇక ఈవెంట్‌ని బట్టి ఈ అద్దె మారుతుందని అంటున్నారు.

Show comments