Akhil Agent Movie Hindi Version In TV: TVలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోన్న అఖిల్‌ ఏజెంట్‌ మూవీ.. కాకపోతే!

Agent Movie: TVలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోన్న అఖిల్‌ ఏజెంట్‌ మూవీ.. కాకపోతే!

అక్కినేని హీరో అఖిల్‌ నటించిన ఏజెంట్‌ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్‌ అవుతోంది. త్వరలోనే ఈ చిత్రం టీవీల్లోకి రాబోతుందట. ఆ వివరాలు..

అక్కినేని హీరో అఖిల్‌ నటించిన ఏజెంట్‌ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్‌ అవుతోంది. త్వరలోనే ఈ చిత్రం టీవీల్లోకి రాబోతుందట. ఆ వివరాలు..

అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం హీరోగా వచ్చిన అఖిల్‌.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. చిన్నప్పుడే సిసింద్రీగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న అఖిల్‌.. ఇప్పుడు హ్యాండ్సమ్‌ లుక్‌తో అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచాడు. మనం సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన అఖిల్‌.. ఆ తర్వాత వీవీ వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన అఖిల్‌ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. అయితే అక్కినేని కుటుంబంలో మిగతా హీరోలకు భిన్నంగా డ్యాన్స్‌లో అఖిల్‌ దుమ్ము లేపుతాడు. దానికి తోడు అందగాడనే పేరు ఉంది. అయితే ఇలాంటి అదనపు బలాలు ఎన్ని ఉన్నా సరే.. అఖిల్‌ ఖాతాలో మాత్రం ఇప్పటి వరకు ఓ సాలిడ్‌ హిట్టు పడలేదు.

అఖిల్‌ ఆఖరిసారిగా ఏజెంట్‌ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా కూడా ఆశించిన మేర సక్సెస్‌ కాలేదు. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం.. అదే స్థాయిలో డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. థియేటర్లలో ఫెయిల్‌ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీల్లో కూడా స్ట్రీమింగ్‌ కాలేదు. ఇలా ఉండగా ఏజెంట్‌ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఓటీటీల్లో విడుదల కానీ ఈ చిత్రం.. ఇప్పుడు ఏకంగా టీవీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది.

ఏజెంట్‌ టీవీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది కానీ.. అది తెలుగులో కాదు.. హిందీలో. ఏజెంట్ సినిమా హిందీ వెర్షన్ త్వరలో గోల్డ్‌ మైన్ టీవీ ఛానెల్లో ప్రీమియర్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఎప్పుడన్న ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ రైట్స్‌ని సోనీ లీవ్‌ దక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు రిలీజ్‌ కాలేదు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించకపోయిన సినీ ప్రేమికులు, ఈ సినిమా చూడనివారు.. ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై కూడా అతి త్వరలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏజెంట్ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా.. మమ్ముట్టి, సాక్షి వైద్య, డినో మోరియాలు కీలక పాత్రల్లో నటించారు.

Show comments