Swetha
బాలీవుడ్ సినీ చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.. అజయ్ దేవ్‌గణ్ హీరోగా మాధవన్ విలన్‌గా నటించిన సైతాన్ మూవీ. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది సైతాన్.
బాలీవుడ్ సినీ చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.. అజయ్ దేవ్‌గణ్ హీరోగా మాధవన్ విలన్‌గా నటించిన సైతాన్ మూవీ. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది సైతాన్.
Swetha
ప్రస్తుతం అంతటా హర్రర్ మూవీస్ హావ నే నడుస్తోంది. ప్రేక్షకులు కూడా హర్రర్ మూవీస్ నే ఎక్కువగా ఆదరించడంతో.. దర్శకులు ఆయా సినిమాలను సరి కొత్తగా చిత్రీకరిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హర్రర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసిన మూవీ రాజ్ 3. ఇమ్రాన్ హష్మీ, బిపాసబసు హీరో,హీరోయిన్లుగా 2012లో రిలీజైన ఈ మూవీ.. దాదాపు 10.33 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత ఈ సినిమాను మరే సినిమా కూడా ఈ రికార్డు బ్రేక్ చేయలేకపోయింది. కానీ, ఇప్పుడు తాజాగా విడుదలైన సైతాన్ సినిమా 12 ఏళ్ళ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఈ వీకెండ్ లో యాభై కోట్ల కలెక్షన్స్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తాజాగా అజయ్ దేవ్‌గణ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ “సైతాన్”. ఈ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ సినిమాకు వికాస్ భల్ దర్శకత్వం వహించారు. సూపర్ న్యాచురల్ హర్రర్ కథాంశంతో.. ఈ సినిమా తెరక్కెక్కింది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్ హీరోగా కనిపించగా, మాధవన్ విలన్‌గా నటించాడు. సూపర్ న్యాచురల్ పవర్స్ కలిగిన విలన్ గా.. డిఫరెంట్ షేడ్స్ లో.. మాధవన్ ఆడియన్సు ను భయపెట్టడని చెప్పి తీరాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది.ఇక ఈ సినిమాను గుజరాతి రీమేక్ గా రూపొందించిన సంగతి తెలిసిందే. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా సైతాన్ మూవీ 14.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రత్యేకించి అజయ్ దేవగణ్ , జ్యోతిక నటనతో.. వచ్చిన ట్విస్ట్స్ , హర్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను.. బాగా ఆకట్టుకున్నాయి. ఇక జ్యోతిక నటన విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, దాదాపు పాతికేళ్ల తరువాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. ప్రస్తుతం ఈ సినిమా భారీ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది.
కాగా, సైతాన్ సినిమా కథ విషయానికొస్తే.. కబీర్ (అజయ్ దేవ్‌గణ్), జ్యోతి(జ్యోతిక) తమ కూతురు జాన్వీతో కలిసి ఓ విలేజ్‌కు హాలీడే ట్రిప్ కు వెళ్తారు. ఓ స్నేహితుడిగా కబీర్‌కు పరిచయం అవుతాడు వన్‌రాజ్ (మాధవన్). అతని రాకతో కబీర్ ఫ్యామిలీ కష్టాల్లో పడుతుంది. తన మాయ, మంత్రాలతో కబీర్ ఫ్యామిలీని వన్‌రాజ్ ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ. అయితే, ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే ఓ నిర్మాతగా వ్యవహరించారు అజయ్ దేవ్‌గణ్. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా భారీగానే అమ్ముడు పోయినట్టు సమాచారం. ఈ సినిమా ఓటీటి రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందట. మరి సైతాన్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.