ఆత్మహత్య చేసుకోబోతున్నా.. సంచలనంగా మారిన ప్రముఖ నటి వీడియో!

Vijayalakshmi Video Viral: నాకు ఈ జీవితం వొద్దు.. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా.. అంటూ ఓ ప్రముఖ నటి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Vijayalakshmi Video Viral: నాకు ఈ జీవితం వొద్దు.. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా.. అంటూ ఓ ప్రముఖ నటి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

సినీ ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం అని అంటారు. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నేనేంటో ప్రపంచానికి చూపిస్తా అంటే ఎంతోమంది యువత ప్రతిరోజూ స్టూడియోల వెంట పడిగాపులు కాస్తుంటారు. కోట్ల మందిలో ఎవరికో ఒక్కరికి వెండితెరపై నటించే ఛాన్స్ దక్కుతుంది. కొంతమందికి మాత్రం స్టార్ డమ్ ఒకేసారి వస్తుంది. అయితే ఇండస్ట్రీలో వెండి తెరపై చూపించిన రంగులు నిజ జీవితంలో ఉండవని కొంతమంద నటీనటుల జీవితాలు చూస్తే అర్థమవుతుంది. ఆర్థికంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొని ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు. తాజాగా ఓ సినీ నటి ఆత్మహత్య చేసుకోబోతున్నా అంటూ వీడియో అప్ లోడ్ చేయడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

తమిళ ఇండస్ట్రీలో ఓ నటి చేసిన వీడియో పోస్ట్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఆ నటి ఎవరో కాదు గతంలో పలు మార్లు తెరపైకి వచ్చిన విజయలక్ష్మి. మంగళవారం విడుదల చేసిన ఓ వీడియోలో ‘మీడియా మిత్రులకు నా నమస్కారం.. ఫిబ్రవరి 29 న ఓ వీడియో నేను పోస్ట్ చేశాను.. నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్ నాతో మాట్లాడాలని.. నాతో కలిసి జీవించాలని కోరా. ఇప్పుడు మార్చి 5వ తేదీ పూర్తయ్యింది.. నేను ఎంతో ఆవేదన, దుఖఃంతో ఆవీడియో పంపించా. నువు లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పా.. నన్ను వివాహం చేసుకుంటా అని మూడేళ్ల పాటు రహస్య జీవితాన్ని కొనసాగించారు. నా జీవితం మొత్తం నాశనం చేశారు.. నన్ను ఇప్పుడు నడిరోడ్డుపై వదిలేశాడు. నాకు ఇప్పుడు ఎవరూ సహకరించడం లేదు.. కనీసం పట్టించుకోవడం లేదు. ఒకవేళ నాకు ఎవరైనా సహాయం చేయడానికి వస్తే.. వారిని తరిమికొడుతున్నారు. ఇప్పుడు కర్ణాటకలో జీవించలేని పరిస్థితిలో ఉన్నా.. ఇదే నా చివరి వీడియో. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా.. కర్ణాటక పోలీసులు తదుపరి వార్త చెబుతారు. నా మరణంపై సీమాన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది’ అని పేర్కొంది.

నటి విజయలక్ష్మి కెరీర్ విషయానికి వస్తే.. 1997 లో నాగమండల మూవీతో నటిగా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 2001 లో రిలీజ్ అయిన హనుమాన్ జంక్షన్ లో నటించింది. ఆ తర్వాత మాలీవుడ్ లో మోహన్ లాల్ నటించిన దేవదూతన్ మూవీలో నటించింది. వరుసగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళంలో సూపర్ హిట్ కామెడీ మూవీ బాస్ ఎంగిరి భాస్కరన్ మూవీతో మంచి ఆదరణ సంపాదించింది. ఈ చిత్రం తెలుగులో నేనే అంబానీ గా రిలీజ్ అయ్యింది. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో నటించింది. అలాగే బంగారు బేటే అనే గేమ్ షోకి యాంకర్ గా పనిచేసింది. ప్రస్తుతం విజయలక్ష్మి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Show comments