డేటింగ్ యాప్ లో పరిచయం.. బాయ్ ఫ్రెండ్ ని పెళ్లాడిన బుల్లితెర నటి

Twinkle Vasisht Marriage Pics:ఈ మద్య వెండితెర, బుల్లితెరకు చెందిన నటీనటులు వరుసగా బ్యాచ్ లర్ జీవితానికి గుడ్ బై చెప్పి వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.

Twinkle Vasisht Marriage Pics:ఈ మద్య వెండితెర, బుల్లితెరకు చెందిన నటీనటులు వరుసగా బ్యాచ్ లర్ జీవితానికి గుడ్ బై చెప్పి వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.

గత ఏడాదిలాగే.. ఈ ఏడాది కూడా ఇండస్ట్రీలో వరుస పెళ్ళిబాజాలు మోగుతున్నాయి. వెండితెర, బుల్లితెర నటీనటులు, దర్శక, నిర్మాత ఇతర రంగాలకు చెందిన వారి విహాలు వరుసగా జరుగుతున్నాయి. వీరిలో చాలా మంది తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొంత మంది పెద్దలు నిశ్చించిన వారిని.. ఇతర రంగాలకు చెందిన వారిని వివాహం చేసుకుంటున్నారు. ఇటీవల బుల్లితెర నటి దిగ్య అగర్వాల్ తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడింది. తాజాగా మరో బుల్లితెర నటి ట్వింకిల్ వశిష్ట్ పెళ్లి పేటలెక్కింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

బుల్లితెర నటి ట్వింకిల్ వశిష్ట్ తాను కోరుకున్న ప్రియుడు హర్ష్ తులిని మంగళవారం పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ట్వింకిల్ – హర్ష డేటింగ్ యప్ ద్వారా కలుసుకొని దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరిక పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకున్నారు. గత ఏడాది ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మార్చి 12 న ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్బంగా నటి ట్వింకిల్ వశిష్ట్ ఓ పోస్ట్ చేసింది. మా ప్రేమ ప్రయాణంలో ఎన్నో బ్రేకప్ లు, ఎత్తు పల్లాలు, ఇతరుల ఎత్తిపొడుపు మాటలు తట్టుకొని ఎదిరించి మా ప్రేమ నిజం అని నిరూపిస్తూ పెళ్లి చేసుకున్నాం అని తెలిపింది.

మా పెళ్లిపై ప్రేమపై చాలా మంది రక రకాలుగా రూమర్లు పుట్టించారు. ఎంతోమంది మా ప్రేమ శాశ్వతం కాదని అన్నారు. నిందలు వేశారు.. మా జంటను విడగొట్టేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. కొన్నిసార్లు ఇద్దరం డిప్రేషన్ లోకి వెళ్లేవాళ్లం. కానీ ప్రేమలో ఒపిక, నమ్మకం, కమిట్ మెంట్ అనేవి ఉండాలని తెలుసుకొని ముందుకు సాగాం. అందరికీ సమాధానంగా వివాహబంధంతో ఒక్కటయ్యాం.. ఐ లవ్యూ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ జంటకు సెలబ్రెటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Show comments