పాఠ్యాంశంగా నటి తమన్నా జీవితం.. మండిపడుతున్న తల్లిదండ్రులు

Actress Tamannah Bhatia: సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తమన్నా వివాదంలో చిక్కుకున్నారు. తమన్నా జీవితాన్ని 7వ తరగతి పాఠ్యాంశంగా చేర్చారు. దీనిపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

Actress Tamannah Bhatia: సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తమన్నా వివాదంలో చిక్కుకున్నారు. తమన్నా జీవితాన్ని 7వ తరగతి పాఠ్యాంశంగా చేర్చారు. దీనిపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

పాఠ్యాంశాల్లో స్వాతంత్ర్య సమరయోధులు, సంఘసేవకులు, ఇతర ప్రముఖుల జీవితాలను చేర్చి విద్యార్థులకు బోధిస్తుంటారు. ఇప్పుడు సినీ తారలు, క్రికెటర్స్ జీవితాలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చుతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తమన్నా జీవితాన్ని 7వ తరగతి పాఠ్యాంశంగా చేర్చారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మిల్కీ బ్యూటీ తమన్నా తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఫేమ్ సంపాదించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది ఈ అమ్మడు. ఇటీవల సినిమాలే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో తమన్నా జీవితాన్ని హెబ్బాళలోని సింధీ ఉన్నత పాఠశాలలో పాఠ్యాంశంగా చేర్చారు.

సినీ నటి తమన్నా ఊహించని వివాదంలో చిక్కుకుంది. బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో నటి తమన్నా, రణ్ వీర్ సింగ్ ల గురించి పాఠ్యాశాన్ని చేర్చడంపై వివాదం నెలకొన్నది. సింధీ వర్గంలో ఎంతో మంది కళాకారులున్నారని, వారిని వదిలేసి సినిమాల్లో అర్థనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ఏంటనీ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు తమ పిల్లలకు టీసీ ఇస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.

కాగా సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలను సాధించడంతోనే ఇలా చేశామని యాజమాన్యం అంటోంది. విద్యార్థుల తల్లిదండ్రులను యాజమాన్యం బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. కాగా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించ‌క‌పోవ‌డంతో కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ను ఆశ్రయించారు. ఇక తెలుగులో శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి ఫేమ్ తెచ్చుకుంది.

Show comments