లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న స్టార్‌ హీరోయిన్‌! వరుడు ఎవరంటే..?

Actress Sohini Sarkar Wedding: సినీ ఇండస్ట్రీలో మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కింది. పెద్దల సమక్షంలో కోరుకున్న ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Sohini Sarkar Wedding: సినీ ఇండస్ట్రీలో మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కింది. పెద్దల సమక్షంలో కోరుకున్న ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత ఏడాది నుంచి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు తమ బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇండస్ట్రీలో చాలా వరకు ప్రేమ వివాహాలే జరుగుతన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమకు నచ్చిన వారితో కొంత కాలం సహజీవనం చేసి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కింది. తాను ప్రేమించిన వ్యక్తిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలు అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి తర్వాత వెండితెరపై హీరోయిన్ గా రాణించిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో బెంగాలీ బ్యూటీ సోహిని సర్కార్ ఒకరు. 2013 లో రూప్ కథా నోయ్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత వరుస ఛాన్సులతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొంత కాలంగా సంగీత దర్శకుడు షోవన్ గంగూలిని ప్రేమించి జులై 15న పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని ఇన్ స్టా ద్వారా వెల్లడించింది. పెళ్లికి ముందు ఈ జంటకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది సోహిని సర్కార్. ఈ ఫోటోల్లో ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

బెంగాలి చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. కెరీర్ బిగినింగ్ లో పలు సీరియల్స్ లో కీలక పాత్రల్లో నటించింది. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత వెండి తెరపై ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం సోహిని సర్కార్ సీరియల్స్, సినిమాలు, వెబ్ సీరీస్ లో హీరోయిన్ గా నటిస్తుంది. గత ఏడాది ఓ పార్టీలో మ్యూజీషియన్ సోవన్ గంగూలీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా ఏర్పడి ఏడాది పాటు డేటింగ్ చేశారు. కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో వీరిపై రక రకాల రూమర్స్ వచ్చాయి.. వాటిని పట్టించుకోలేదు. మొత్తానికి సైలెంట్ గా ఏడాది తర్వాత ప్రేమించిన ప్రియుడిని పెళాడి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments