Shruti Haasan: అరుదైన వ్యాధీతో బాధపడుతున్న శృతిహాసన్‌.. సంచలన విషయాలు వెల్లడి

టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ తన ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..

టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ తన ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..

సెలబ్రిటీలు అనగానే అన్ని రకాలుగా ఫిట్‌గా ఉంటారని సామాన్య జనాలు భావిస్తూ ఉంటారు. చాలా వరకు అది వాస్తవం కూడా. ఎందుకుంటే వారిది క్రమశిక్షణతో కూడిన జీవితం. సినీ ఇండస్ట్రీలో కొనసాగాలంటే.. ముందుగా కావాల్సింది తీరైన శరీరాకృతి. హీరోయిన్లకైతే ఇది చాలా ప్రధానం. అందుకే వారికి ఇష్టం లేకపోయినా.. ఎంత కష్టమైనా సరే.. నోరు కట్టుకుని.. శరీరాన్ని కష్టపెడతారు. అయితే ఈ క్రమంలో సెలబ్రిటీలు కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారు. తాను కూడా ఇలానే ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌. ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..

కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శృతి హాసన్‌. ప్రారంభంలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ పోయింది. కానీ వాటిల్లో హిట్టు కొట్టినవి చాలా తక్కువ. దాంతో ఈ అమ్మడి మీద ఐరెన్‌ లెగ్‌ అనే ముద్ర కూడా పడింది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్‌. వరుస సినిమాలు చేసినప్పటికి.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్‌ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి హిట్స్ అందుకుంది శృతి హాసన్. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోలతో పాటు.. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. తాజాగా ప్రభాస్‌ సలార్‌ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శృతి హాసన్‌.. వ్యక్తిగత జీవితంలో మాత్రం నిత్యం ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది. కొన్ని రోజుల క్రితమే బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్‌ అని ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా తన ఆరోగ్యం గురించి సంచలన విషయాలు వెల్లడించింది శృతి హాసన్‌. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. తనకి పీసీఓఎస్ సమస్య ఉందనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అలానే బ్యాడ్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించింది.

Show comments