Shalini Pandey: ఆ హీరోతో రొమాంటిక్ సీన్స్ చేయలేక బయటకి వెళ్ళిపోయా: అర్జున్ రెడ్డి హీరోయిన్!

యంగ్ బ్యూటీ షాలిని పాండే ఇటీవలే బాలీవుడ్ లో మహారాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ఆ మూవీలో ఆ హీరోతో ఆ సీన్స్ చేసినప్పుడు భయపడి భయటకు వచ్చేశా అంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

యంగ్ బ్యూటీ షాలిని పాండే ఇటీవలే బాలీవుడ్ లో మహారాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ఆ మూవీలో ఆ హీరోతో ఆ సీన్స్ చేసినప్పుడు భయపడి భయటకు వచ్చేశా అంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

‘షాలిని పాండే’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాగా, ఈమె విజయ్ దేవరకొండ సరసన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సినిమాలో షాలిని తన అందం, నటనతో ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. పైగా మొదటి సినిమాతోనే మంచి సక్సేస్ అందుకున్న షాలినికి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడతాయని అంతా భావించారు. కానీ, షాలినికి మాత్రం టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కాగా, తెలుగులో మహానటి సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ 118లో హీరోయిన్ గా మాత్రమే నటించింది.

ఇక ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కు మకాం మార్చింది. ప్రస్తుతం అక్కడే చేతినిండా సినిమాలతో షాలిని బిజిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అమ్మాడు ‘మహారాజ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ సినిమాను సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిగా.. ఇందులో  అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించాడు. అలాగే ఇందులో  జైదీప్ అహ్లావత్ కీలకపాత్రలు పోషించారు. కాగా,ఈ సినిమా జూన్ 21న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

షాలిని పాండే మహారాజ్ మూవీలో కిషోరి అనే పాత్రలో అలరించింది. ఇక ఈ సినిమాలో జైదీప్ అహ్లావత్ తో షాలిని చేసే రొమాంటిక్ సీన్స్ గురించి తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసినప్పుడు నేను సడెన్ గా బయటకు వెళ్లిపోయాను. ఎందుకంటే ఆ సీన్ తనపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలియదు కానీ, తనకు చీకటి గదిలో ఉండాలంటే చాలా భయమని చెప్పింది. అలాగే తనకు కాస్త సమయం కావాలని, ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడని అడిగానని తెలిపింది. ఇక వారు కూడా నా పరిస్థితిన అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చింది.

ఇకపోతే మొదట్లో స్క్రిప్ట్ చదివినప్పుడు కిషోరి పాత్ర చాలా తెలివి తక్కువ అమ్మాయి అనుకున్నానని, కానీ, ఆ తర్వాత ఆమె చేసే ప్రతి విషయాన్ని కచ్చితంగా నమ్ముతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ వీడియోలు వైరల్ గా మారాయి. ఇక మహారాజ్ మూవీ విషయానికొస్తే.. ఈ మూవీని 1800 కాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించగా.. జునైద్ కోర్టులో మహారాజ్ దోపిడీలపై పోరాడే రచయితగా నటించాడు. మరి, షాలిని పాండే మహారాజ్ మూవీలో తాను ఎదుర్కొన సంఘటన గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments