ప్రముఖ నటిపై దాడి.. ప్లీజ్ వొద్దని వేడుకున్నా వినలేదు.. వీడియో వైరల్

Mumbai Bandra: ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రోడ్డు ప్రమాదాలకు కారకులు కావడం.. ఆ ప్రమాదాల్లో చనిపోవడం జరుగుతుంది.

Mumbai Bandra: ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రోడ్డు ప్రమాదాలకు కారకులు కావడం.. ఆ ప్రమాదాల్లో చనిపోవడం జరుగుతుంది.

ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురి కావడం, కోపం తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. శాంతంగా కూర్చొని మాట్లాడుకొని తెల్చుకునే గొడవలు చిలికి చిలికి గాలి వానగా మారి పెద్దగా మారుతుంటాయి. ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు బయటకు వచ్చి నానా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రముఖ నటి చిక్కుల్లో ఇరుక్కున్నట్లో తెలుస్తుంది. ఆ నటిపై కొంతమంది దాడి చేయగా.. ప్లీజ్ కొట్టొద్దు అంటూ వేడుకుంది. ఇంతకీ ఆ నటి ఎవరు.. ఎందుకు ఆమెపై దాడికి తెగబడ్డారు అన్న విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవినా టాండన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. బాలీవుడ్ లో సుమారు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తుంది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది. ఇటీవల యష్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 2 ’ మూవీలో కీలక పాత్ర పోషించింది. తాజాగా రవీనా టాండన్ పై కొంతమంది దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగిందంటే.. శనివారం రాత్రి ముంబైలోని రిజ్వీ లా కాలేజ్ సమీపంలో రవీనా టాండన్ ప్రయాణిస్తున్న కారు ముగ్గురు మహిళలకు ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆ మహిళలకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. కారు డ్రైవర్ ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ తమపైకి దూసుకు వచ్చాడని బాధితులు ఆరోపించారు. ఈ విషయం గురించి డ్రైవర్ ని ప్రశిస్తుంటే.. కారు లో నుంచి రవినా టాండన్ కిందికి దిగారు.

బాధితులు కారు డ్రైవర్ ని ప్రశ్నిస్తుంటే.. రవినా అతనికి మద్దతుగా మాటాడింది. తమ కారు ఎవరికీ డ్యాష్ ఇవ్వలేదని.. అవనసరం గా రచ్చ చేస్తున్నారని తెలిపింది. మరోవైపు రవీనా తన తల్లిపై దాడి   చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అక్కడి స్థానికులు రవినా టాండన్ ని చుట్టు ముట్టారు.. ఆమెను తోశారు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. అక్కడ ఓ మహిళ నా ముక్కులో నుంచి రక్తం వస్తుంది.. రవీనా నా పై దాడి చేసిందని ఆరోపించింది. మరోవైపు రవీనాపై కొందరు దాడి చేసే యత్నం చేశారు. ఆ సమయంలో ఆమె ప్లీజ్ నన్ను కొట్టకండి.. తోయకండి అంటూ వేడుకుంది. దయచేసి వీడియో తీయకండీ అంటూ కోరింది. ఆ సమయంలో కొంత మంది ఆమెపై దాడి చేయాలంటూ గట్టిగా అరిచారు.  తాజాగా దీనికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై రవీనా టాండన్ తన లాయర్లను సంప్రదించినట్లు తెలుస్తుంది.

Show comments