ఈ ఫోటోలోని చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎలా ఉండేది.. ఎలా అయిపోయింది

నవ్వులు చిందిస్తూ ఎంతో పద్దతిగా ఉన్న ఈ అమ్మాయి.. స్టార్ హీరోయిన్.. నార్త్ ఇండియా నుండి వచ్చి.. పదాహరణాల తెలుగు అమ్మాయిగా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టి ఎంతలా మారిపోయిందంటే..

నవ్వులు చిందిస్తూ ఎంతో పద్దతిగా ఉన్న ఈ అమ్మాయి.. స్టార్ హీరోయిన్.. నార్త్ ఇండియా నుండి వచ్చి.. పదాహరణాల తెలుగు అమ్మాయిగా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టి ఎంతలా మారిపోయిందంటే..

బాలీవుడ్‌లో అడపా దడపా సినిమాలు చేశాక.. సరైన అవకాశాలు రాకపోవడంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లా ఉంటుంది టాలీవుడ్ బాట పడుతున్నారు చాలా మంది హీరోయిన్లు. ఇక్కడ కాస్త యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుని, హిట్స్ అందుకుని..స్టాండర్ట్ హీరోయిన్‌గా మారాక..రెమ్యునరేషన్ పెంచేస్తారు. మెల్లిగా దక్షిణాది ఇండస్ట్రీని మడత పెట్టేసి.. మళ్లీ ఫైనల్ టచ్ అనుకుంటూ బాలీవుడ్ చెక్కేస్తున్నారు ముద్దుగుమ్మలు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నో గ్లామర్ అంటూ.. బీ టౌన్‌కు వెళ్లాక లిప్ లాక్ సీన్స్, హాట్ సీన్స్‌లో నటిస్తూ రెచ్చిపోతున్నారు. ఇక్కడ దర్శక నిర్మాతలకు బోర్డర్స్ పెట్టి.. అక్కడకు వెళ్లాక ప్లేట్ ఫిరాయించేస్తున్నారు. అలాంటి భామల్లో కొత్తగా చేరిందో క్వీన్.

సంస్కారవంతమైన సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులు తమ సొంత అమ్మాయిగా ఓన్ చేసుకున్న ఈ బ్యూటీ..హిందీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాక గ్లామరస్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తుంది. ఇక్కడ షార్ట్ డ్రెస్సులో అరుదుగా కనిపించిన ఈ అమ్మడు..తనను కాదన్న హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లి నిత్యం అదే పొట్టి దుస్తుల్లో దర్శనమిస్తోంది. బాలీవుడ్‌కు తగ్గట్లు మేకోవర్ అయిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా..అందాన్నంతా ఓ చోట రాశి పోసినట్లుగా ఉండే రాశి ఖన్నా. మద్రాస్ కేఫేతో బీటౌన్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ డాళ్.. ఊహాలు గుసగుసలాడే మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది. మనం మూవీలో ఓ స్పెషల్ క్యారెక్టర్‌లో మెరిసింది ఈ సోయగం.

టైర్ 2 హీరోలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆడిపాడింది. జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, హైపర్, జై లవ కుశ వంటి చిత్రాల్లో నటించింది. విలన్ అనే మలయాళీ సినిమా చేసింది ఈ భామ. తెలుగులో ఆమెకు బోలెడు అవకాశాలు ఇచ్చింది.. కానీ స్టార్ హీరోలతో ఆడిపాడే అవకాశం మాత్రం రాలేదు. ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలి ప్రేమ, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేసి.. తమిళ సినిమాల వైపు టర్న్ తీసుకుంది. తమిళంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. మళ్లీ తెలుగులోకి వచ్చి వెంకీ మామ, ప్రతి రోజు పండుగ, వరల్డ్ ఫేమస్ లవర్ చేసింది. ఈ సారి టీటౌన్‌కు ఓ ఏడాది బ్రేక్ ఇచ్చి తమిళ్, మలయాళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

పక్కా కమర్షియల్, థ్యాంక్యూ తర్వాత ఆమె కనిపించలేదు. కానీ డబ్బింగ్ సినిమాలు తిరు, సర్దార్ మూవీలతో పలకరించింది.  బాలీవుడ్ బాటను మెల్లిగా స్టార్ చేసింది. ఫర్జీ వెబ్ సిరీస్‌లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. యోధ కూడా నటిగా గుర్తింపు నిచ్చింది. ఇప్పుడు తమిళం, తెలుగు,హిందీ చిత్రాల్లో అవకాశాలను పొందుతూ.. మూడు పడవల మీద నడుస్తోంది రాశి. ఆర్మణి, మేథావి కాకుండా హిందీ పిక్చర్ ద సబర్మతి రిపోర్ట్, తెలుసు కదా వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తోంది.

Show comments