P Krishna
కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన వారు వివిధ రంగాల్లోకి అడుగు పెట్టారు. కొంతమంది వ్యాపార రంగంలోకి, రియలెస్టేట్ రంగంలోకి వెళితే.. కొంతమంది స్పోర్ట్స్ పై ఫోకస్ పెట్టారు.
కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన వారు వివిధ రంగాల్లోకి అడుగు పెట్టారు. కొంతమంది వ్యాపార రంగంలోకి, రియలెస్టేట్ రంగంలోకి వెళితే.. కొంతమంది స్పోర్ట్స్ పై ఫోకస్ పెట్టారు.
P Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు సూర్యాకాంతం, గీతాంజలి, రమాప్రభ, గిరిజ, శ్రీలక్ష్మి ఇలా ఎంతోమంది నటీమణులు స్టార్ కమెడియన్లతో పోటీ పడీ మరీ నటించేవారు. తమదైన హాస్యంతో కడుపుబ్బా నవ్వించేవారు. తర్వాత కోవై సరళ, సురేఖా వాణి,హేమ, ప్రగతి లాంటి నటీమణులు తమదైనా కామెడీ మార్క్ చాటుకుంటున్నారు. బుల్లితెరపై సందడి చేసినవారు ఇప్పుడు వెండితెరపై కామెడియన్లు గా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో నటి ప్రగతి ఒకరు. ప్రముఖ తమిళ నటుడు భాగ్యరాజ్ తన మూవీలో ప్రగతికి ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించింది.. తర్వాత బుల్లితెరపై కనిపించింది. వివాహం అనంతరం కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ఆమె తెలుగులో బుల్లితెరపై అడుగుపెట్టింది. అక్కడ పాపులర్ అయిన తర్వాత వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. నటిగానే కాకుండా వెయిట్ లిఫ్లింగ్ ఛాంపియన్ గా సత్తా చాటుతున్నారు నటి ప్రగతి. వివరాల్లోకి వెళితె..
మహేష్ బాబు నటించిన బాబీ మూవీతో నటిగా మంచి పేరు సంపాదించింద ప్రగతి. తర్వాత టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ తో నటించి తనదైన కామెడీ మార్క్ చాటుకున్నారు ప్రగతి. నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రగతి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. ‘ఏమైంది ఈవేళ’ మూవీలో ఆమె పాత్రకు ఉత్తమ సహాయ నటిగా నందీ అవార్డు దక్కింది. తన పర్సనల్ ఫోటోలు, వీడియోలు ఫ్యాన్స్ తో ఇన్ స్ట్రాలో షేర్ చేస్తుంది. ఆ మద్య జిమ్ లో చేసే వెయిట్ లిఫ్టింగ్ కి సంబంధించిన వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టింది. సినిమాల్లో చాలా సాఫ్ట్ గా, కామెడీగా కనిపించే ప్రగతి బయట స్పోర్ట్స్ లో ఎంతో యాక్టీవ్ గా ఉంటున్నారు. అందుకోసం కఠోర శ్రమ చేస్తున్నారు. సాధారణంగా నటీనటులు ఫిట్ నెస్ కోసం యోగా, జిమ్ లాంటివి చేస్తుంటారు. కానీ ప్రగతి మాత్రం ప్రోఫెషనల్ పవర్ వెయిట్ లిఫ్టర్ గా మారిపోయింది. అంతేకాదు పలు పోటీల్లో పాల్గొంటూ అవార్డులు కైవసం చేసుకుంటుంది.
కరోనా సినీ ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొంతమంది కరోనా సమయంలో ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడ్డారు.. జీవితంలో కోలుకోలేని దెబ్బ తిన్నారు. మరికొంత మంది ఇండస్ట్రీలో కొనసాగుతూనే పలు వ్యాపార రంగాలు, ఇతర రంగాల్లోకి వెళ్లిపోయారు. ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టారు. కరోనా సమయంలో నటి ప్రగతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. 45 ప్లస్ లో ఆమె జిమ్ లో వర్క్ ఔట్లు చూసి కుర్రాళ్లు సైతం ఔరా అన్నారు. నటిగానే కాకుండా ఆమె మరో అవతారం కూడా ఎత్తింది. నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్స్ లో పాల్గొంటు పలు పతకాలు సాధిస్తుంది. తాజాగా బెంగుళూరులోని ఇంజనీర్స్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన 28వ పురుషుల, మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ లో ప్రొఫెషనల్స్ తో పోటి పడి కాంస్య పతకం సాధించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో షేర్ చేసింది నటి ప్రగతి.