నటి దారుణ హత్య.. 13 ఏళ్ల తర్వాత తండ్రి దోషిగా తేల్చిన కోర్టు

కన్నడ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఓ నటి.. బాలీవుడ్ లో సత్తా చాటాలని అనుకుంది. ఓ సినిమా చేస్తుండగా.. మధ్యలో కుటంబ సభ్యులతో తన ఫాం హౌస్ కు వెళ్లింది. కానీ అలా వెళ్లిన వారంతా.. కొన్ని నెలలకు మృతదేహాలై కనిపించారు.

కన్నడ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఓ నటి.. బాలీవుడ్ లో సత్తా చాటాలని అనుకుంది. ఓ సినిమా చేస్తుండగా.. మధ్యలో కుటంబ సభ్యులతో తన ఫాం హౌస్ కు వెళ్లింది. కానీ అలా వెళ్లిన వారంతా.. కొన్ని నెలలకు మృతదేహాలై కనిపించారు.

ఇండస్ట్రీలో కొంత మంది నటీమణుల మరణాలు ఎప్పటికీ అంతు చిక్కని విషాదాలుగా నిలిచిపోతుంటాయి. టాలీవుడ్,బాలీవుడ్‌ను తన అందంతో ఓ ఊపు ఊపేసిన దివ్యభారతి, తన మత్తైన కళ్లతో కుర్రకారును గిలింగితలు పెట్టిన స్కిల్క్ స్మిత, అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న నటి ప్రత్యూష, అష్టాచమ్మా హీరోయిన్ భార్గవి, బాలీవుడ్ నటి జియా ఖాన్ మరణాలను అభిమానులు ఎప్పుడూ మరచిపోలేరు. అలాంటి కేసే ఈ నటి మరణం కూడా.  13 ఏళ్ల క్రితం బాలీవుడ్ నటి లైలా ఖాన్, ఆమె కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. కానీ 2011లో ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఇగత్ పురిలోని తమ బంగ్లాలో నటి, ఆమె తల్లి, నలుగురు తోబుట్టువులు హత్యకు గురయ్యారు.

తొలుత లైలా తండ్రి నాదిర్ పటేల్.. కూతురు, భార్య షెలీనా పటేల్, మిగిలిన పిల్లలు కనిపించడం లేదంటూ పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఆమెతో సినిమాను తెరకెక్కిస్తోన్న డైరెక్టర్ కూడా కంప్లయింట్ చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించగా.. నటి మొబైల్ సిగ్నల్ చివరిసారిగా నాసిక్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ ఆమెకు ఫామ్ హౌస్ ఉందని తెలిసి వెళ్లారు. . కాస్త పాక్షికంగా అగ్ని ప్రమాదానికి గురి అయ్యి ఉండటం.. కొన్ని నెలల తర్వాత జమ్ము కాశ్మీర్‌లో వీరి వాహనం దొరకడంతో కేసు క్రిటికల్ అయ్యింది. అయితే వీరి ఆచూకీపై ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ సమయంలో లైలా సవితి తండ్రి పర్వేజ్ తక్ పై పోలీసులకు అనుమానం ఏర్పడింది. అతడ్ని జమ్ము కాశ్మీర్‌లో అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగు చూసింది.

ఆస్తి విషయంలో గొడవ జరిగి భార్య షెలీనాను చంపి, ఆ తర్వాత లైలా, ఆమె అక్క అమీనా, కవల తోబుట్టువులు జారా, ఇమ్రాన్ అలాగే కజిన్ రేష్మాలను హత్య చేసినట్లు తెలిపాడు. అనంతరం బంగ్లా నుంచి కుళ్లిపోయిన మృతదేహాలను వెలికితీశారు.షెలీనా ఇద్దరు మాజీ భర్తలతో సహా 40 మంది సాక్షులను విచారించారు. తాజాగా విచారణలో ముంబయిలోని సెషన్ కోర్టు పర్వేజ్ తక్‌ను దోషిగా నిర్ధారించింది. మే 14న శిక్ష ఖరారు చేయనుంది. 1978లో  జన్మించిన లైలా అసలు పేరు రేష్మా.. 2002లో కన్నడ చిత్రంతో రేష్మా పటేల్ పేరుతో ఎంట్రీ ఇచ్చింది. కానీ అది ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. రాజేష్ ఖన్నా సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు అంతపేరు తీసుకురాలేదు. రాకేష్ సావంత్ దర్శకత్వంలో జిన్నాత్ అనే చిత్రం చేస్తుండగా.. 2011లో హాలీడే హోంకు బయలుదేరింది లైలా ఖాన్ కుటుంబం. అంతలో అదృశ్యం కావడంతో తండ్రి ఫిర్యాదుతో.. వీరంతా కుళ్లిన స్థితిలో శవమై కనపించారు.

Show comments