తెలుగువారిపై వివాదాస్పద కామెంట్స్..కస్తూరికి కోర్టు షాక్! అరెస్ట్ కి రంగం సిద్దం?

Acteress Kasturi : నటి కస్తూనే ఇటీవల ఓ మిటింగ్ లో మాట్లాడుతూ.. అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. ఇప్పుడు వారు తమది తమిళ జాతి అని అనడం హాస్యాస్పదంగా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమెపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.

Acteress Kasturi : నటి కస్తూనే ఇటీవల ఓ మిటింగ్ లో మాట్లాడుతూ.. అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. ఇప్పుడు వారు తమది తమిళ జాతి అని అనడం హాస్యాస్పదంగా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమెపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.

నటి కస్తూరి ఈ మధ్య తెలుగు వారిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెను కష్టల్లోకి నెట్టాయి. సోషల్ మీడియా వేధికగా ఆమెపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. అంతఃపుర మహిళలకు దాసీగా సేవలు చేయడానికి తమిళనాడు వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కస్తూరు చేసిన వ్యాఖ్యలపై తెలుగువారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దేశ వ్యాప్తంగా తెలుగు సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.

సినీ నటి కస్తూరు చేసిన వివాాదాస్ప వ్యాఖ్యలు ఆమెను తీవ్ర కష్టాల్లోకి నెట్టాయి. ఆమె తెలుగు వారిపై చేసిన కాంట్రవర్సీ వ్యాఖ్యలపై  తెలుగు సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. అంతేకాదు ఆహెపై  చెన్నై, మధురై సహా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. కేసు నమోదు చేసుకొని విచారణకు పిలిచేందుకు ఆమె ఇంటికి పోలీసులు వెళ్లగా తాళం వేసి ఉంది. ఆమె సెల్ ఫోన్ కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో ఆమె ఇంటికి నోటీసులు అతికించి వెళ్లారు పోలీసులు. అప్పటి నుంచి ఎవరికీ కనిపించకుండా కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లింది. అంతేకాదు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మద్రాస్ హై కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం కస్తూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ స్వప్రయోజనాల కోసం తెలుగు, తమిళుల మధ్య ఘర్షణలు చెలరేగేలా మాట్లాడటం ముమ్మాటికి క్షమించరాని నేరంగా పరిగణించబడుతుందని అన్నారు. ఈ క్రమంలోనే ఆమె పిటీషన్ కొట్టివేసింది. పరారీలో ఉన్న కస్తూరి ముందస్తు బెయిల్ కోర్టు కొట్టివేయడంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు పోలీసులు.

ఇంతకీ నటి కస్తూరి చేసిన వ్యాఖ్యల ఏంటీ? తెలుగు వారి మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయో తెలుసుకుందాం. హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరుపున బ్రహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. వీరు నిర్వహించిన ఓ కార్యక్రమంలో కస్తూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవలు చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలా వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తమిళ జాతి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో వచ్చిన బ్రహ్మణులు తమిళులు కాదని కాదని చెప్పడానికి తెలుగు వారు ఎవరు? అంటూ ఆమె ప్రశ్నించింది. అంతే ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక్కసారే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యావత్ తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.

ఇదిలా ఉంటే.. తాను చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగువారి మనోభావాలు దెబ్బతింటే తనను క్షమించాలని కోరింది. తనకు తెలుగు గడ్డ మెట్టినిల్లు అని.. తెలుగు ప్రజలను తాను కించపరిచేలా మాట్లాడలేదని చెప్పింది. తన వ్యాఖ్యలను కావాలనే డీఎంకే పార్టీ నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను కావాలనే డీఎంకే నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ, అప్పటికే ఆమెపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే ఆమె కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నారు. పోలీసులు నేడో రేపో కస్తూరిని అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Show comments